‘గిలానీకి అత్యున్నత పురస్కారమివ్వాలి’

by Shamantha N |
‘గిలానీకి అత్యున్నత పురస్కారమివ్వాలి’
X

న్యూఢిల్లీ: పీవోకేలో పరిస్థితులు చక్కబెట్టడానికి పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే హురియత్ కాన్ఫరెన్స్ మాజీ చైర్మన్, ఏళ్లపాటు నిర్బంధాలను ఎదుర్కొన్న వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కరాన్ని అందించాలని పాకిస్తాన్ సెనేట్ తీర్మానించింది.

పీవోకేలో తనను, తన నామినీని పక్కక్కు తప్పించాలని పాక్ ప్రభుత్వం కొన్నేళ్లపాటు ప్రయత్నించిందని విమర్శిస్తూ ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ పదవి నుంచి గిలానీ రాజీనామాను ప్రకటించిన సంగతి తెలిసిందే. పీవోకేలో హురియత్ నేతలు పాక్ ప్రభుత్వం చెప్పుచేతల్లోకి వెళ్లారని, అవినీతికి పాల్పడుతున్నారనీ అప్పుడు ఆరోపించారు.

ఈ నేపథ్యంలోనే పీవోకేలో పరిస్థితులు సద్దుమణిగించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ సందర్భంలోనే గిలానీకి పాకిస్తాన్ అత్యుతన్నత పురస్కారం నిషాన్-ఈ-పాకిస్తాన్‌తో గౌరవించాలని పాకిస్తాన్ పార్లమెంట్ ఎగువ సభ సోమవారం తీర్మానించింది. అంతేకాదు, ఓ యూనివర్సిటీకి అతని పేరుపెట్టాలని, స్కూల్ సిలబస్‌లోనూ అతని జీవితాన్ని పాఠ్యంగా చేర్చాలని ప్రతిపాదించింది.

Advertisement

Next Story