ఐపీఎల్ ఆడటానికి పాక్ ఆటగాడి కొత్త ఐడియా

by Shyam |
ఐపీఎల్ ఆడటానికి పాక్ ఆటగాడి కొత్త ఐడియా
X

దిశ, స్పోర్ట్స్ : క్రికెట్ లీగ్స్‌లో ఐపీఎల్‌కు ఎంతో ప్రత్యేకత ఉన్నది. రెండు నెలల పాటు జరిగే ఈ లీగ్ ఆడటం ద్వారా పేరుతో పాటు, భారీగా డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. అందుకే ప్రపంచంలోని ప్రతీ క్రికెటర్ ఐపీఎల్ ఆడాలని ప్రయత్నిస్తుంటారు. పాకిస్తాన్ క్రికెటర్లు కూడా తొలి సీజన్‌లో ఐపీఎల్ ఆడారు. అయితే ఇండియా-పాకిస్తాన్ ఉద్రిక్తల నడుమ ఆ దేశ క్రికెటర్లను ఐపీఎల్ నుంచి నిషేధించారు. దీంతో ఒక పాకిస్తాన్ క్రికెటర్ మరో మార్గంలో ఐపీఎల్ ఆడటానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన పాకిస్తాన్ పేసర్ మహ్మద్ అమీర్ ప్రస్తుతం యూకేలో ఉంటున్నాడు.

అమీర్ భార్య యూకే పౌరురాలు కావడంతో అతడు కూడా అక్కడి పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఒక వేళ అతడికి యూకే పౌరసత్వం లభిస్తే ఐపీఎల్ ఆడే అవకాశం కలుగుతుంది. అమిర్ గతంలో ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు. ఎడమ చేతి వాటం పేసర్ అయిన మహ్మద్‌కు ఐపీఎల్ మంచి అవకాశాలు వస్తాయనే భావిస్తున్నాడు. పాకిస్తాన్ జాతీయుడైన ఇమ్రాన్ తాహీర్ సౌతాఫ్రికా పౌరసత్వం కలిగి ఉండి, ఆ దేశం తరపున ఆడటం వల్ల ఐపీఎల్‌లో అవకాశం దక్కించుకున్నాడు.

Advertisement

Next Story

Most Viewed