కరోనాపై పోరుకు.. సార్క్ ఫండ్‌కు పాక్ 3 మిలియన్ డాలర్లు విరాళం

by vinod kumar |

ఇస్లామాబాద్: ప్రపంచ దేశాలన్నీ కరోనాపై పోరాటానికి భారీ మొత్తంలో నిధులను ఖర్చు చేస్తున్నాయి. ఇప్పటికే ఆర్థికంగా వెనుకబడిన, అభివృద్ది చెందుతున్న దేశాలకు ప్రపంచ బ్యాంకు నిధులు అందిస్తోంది. అయినా సరే పలు దేశాలకు.. ముఖ్యంగా దక్షిణాసియా దేశాలకు ఈ పోరాటంలో ఒక నిధి ఉండాలనే ఆలోచనతో సార్క్ ఎమర్జెన్సీ ఫండ్‌ను భారత ప్రధాని మోడీ ప్రతిపాదించారు. భారత్ తరపున ముందుగా కోటి డాలర్లు (రూ. 74 కోట్లు) ప్రకటించి.. మిగతా సభ్య దేశాలను కూడా తగినంత సాయం చేయాలని కోరారు. దీంతో నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, శ్రీలంక తమ సాయం అందించడానికి ముందుకు వచ్చాయి. కాని పాకిస్తాన్ మాత్రం చాలా తాత్సారం చేస్తూ వచ్చింది. చివరకు నెల రోజుల తర్వాత గురువారం తమ సాయాన్ని ప్రకటించింది. దీనికి అనేక షరతులు విధించింది. పాకిస్తాన్ తరపున సార్క్ ఎమర్జెన్సీ ఫండ్‌కు 3 మిలియన్ డాలర్లను అందిస్తామని ప్రకటించింది. ఈ మేరకు సార్క్ ప్రధాన కార్యదర్శి ఎసలా రువాన్ వీరకూన్‌కు పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి సమాచారం అందించారు. కానీ, నిధులకు సంబంధించిన అన్ని ప్రక్రియలు సార్క్ కార్యదర్శి నియంత్రణలోనే జరగాలని, నిధుల వినియోగం విషయంలో అన్ని సభ్య దేశాలను సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని పాక్ షరతులు విధించింది.

Tags: saarc, fund, pakistan, donation, india, proposed, relief

Advertisement

Next Story

Most Viewed