ఇండియన్ ట్రాన్స్‌జెండర్లకు అంతర్జాతీయ గౌరవం

by Shyam |
ఇండియన్ ట్రాన్స్‌జెండర్లకు అంతర్జాతీయ గౌరవం
X

దిశ, ఫీచర్స్ : చెన్నైకి చెందిన అభినయ(34) అనే ట్రాన్స్‌ఉమన్.. గతేడాది సెప్టెంబర్‌లో కరోనా సెకండ్ వేవ్ విపత్కర పరిస్థితుల నడుమ మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ కారణంగా మరణించింది. ఒక ట్రాన్స్‌పర్సన్‌‌గా ఆమె జీవితంలో ఎదుర్కొన్న కష్టాలన్నీ తన పెయింటింగ్స్‌లో ప్రతిబింబించేవి. అభినయ ఈ లోకాన్ని విడిచినప్పటికీ.. మూడేళ్ల కిందట ఆమె వేసిన పెయింటింగ్స్‌కు ప్రస్తుతం గుర్తింపు దక్కనుంది. త్వరలోనే డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఉమెన్స్ అండ్ జెండర్ స్టడీస్, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా నిర్వహిస్తున్న ‘విజిబిలిటీ అండ్ రిమెంబరెన్స్ : స్టాండింగ్ విత్ ది ట్రాన్స్ కమ్యూనిటీ’లో ఆమె పెయింటింగ్స్‌ ప్రదర్శించబడనున్నాయి.

కాగా అభినయ పెయింటింగ్స్‌కు గౌరవం లభించడం పట్ల ట్రాన్స్ఉమన్, యాక్టివిస్ట్ అండ్ ఆర్టిస్ట్ కల్కి సుబ్రమణ్యం సంతోషం వ్యక్తం చేసింది. నవంబర్ 20 నుంచి ఏప్రిల్ 20, 2022 వరకు తమిళనాడు, కేరళకు చెందిన మొత్తం ఎనిమిది మంది ట్రాన్స్ ఆర్టిస్టుల పెయింటింగ్స్ ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించబడనున్నాయి. ఇక్కడ ఎంపికైన పెయింటింగ్స్ విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో కూడా డిస్‌ప్లే చేయబడతాయి. ఇక ఈ ఎనిమిది మంది ఆర్టిస్టుల్లో ట్రాన్స్ ఉమెన్ అభినయ, కల్కి, సిల్కీ ప్రేమ, రూపకళ, రంభ, సంధ్యతో పాటు ట్రాన్స్‌మెన్ రమేష్‌లు తమిళనాడుకు చెందినవారు కాగా, ట్రాన్స్ ఉమన్ సాజి వారియర్ కేరళకు చెందిన ఆర్టిస్ట్.

ఇండియా నుంచి 25 ఎంట్రీస్..

‘ఇండియాకు చెందిన ట్రాన్స్‌పర్సన్స్ నుంచి మొత్తం 25 ఎంట్రీలు సబ్మిట్ చేయబడగా.. ఇందులో మేము పంపిన 8 ఎంట్రీలు ప్రదర్శనకు ఎంపికవడం భారతీయ ట్రాన్స్ కమ్యూనిటీకి అంతర్జాతీయంగా దక్కిన గౌరవం. సెలెక్ట్ అయిన పెయింటింగ్స్ అన్నీ ప్రాథమికంగా ట్రాన్స్‌పర్సన్స్ జీవితాలకు సంబంధించి వేడుక లాంటిదే. సాధారణంగా ట్రాన్స్‌పర్సన్స్ యాచక, వ్యభిచార వృత్తిలో మాత్రమే ఉంటారన్న అపోహ ఉంది. ఇప్పుడు మా ఆర్ట్‌ వర్క్స్‌కు అంతర్జాతీయంగా ఆదరణ లభిస్తుండటం వల్ల మూస పద్ధతులను విడనాడాలని ఆశిస్తున్నాం’ అని కల్కి అన్నారు.

పొల్లాచ్చిలో ట్రాన్స్‌పర్సన్స్ కోసం గ్యాలరీ, స్కిల్ ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ సాయాన్ని పొందే ప్రయత్నాల్లో తమ బృందం ఉందని కల్కి వెల్లడించింది. ట్రాన్స్‌పర్సన్స్‌కు నైపుణ్య శిక్షణ అందించే కేంద్రం కోసం స్థలం కేటాయించి, నిధులు మంజూరు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసినట్లు తెలిపింది. కాగా కోకోనట్ కాపిటల్‌గా ఉన్న పొల్లాచ్చి.. కొబ్బరి ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్‌లో నైపుణ్య శిక్షణను అందించేందుకు అపారమైన అవకాశాలను కలిగి ఉందని ఆమె చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed