- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సెల్‌ఫోన్, పర్సు ఇంట్లోనే వదిలివెళ్లిన భర్త.. పీఎస్‌లో ఫిర్యాదు చేసిన భార్య

X
దిశ, కుత్బుల్లాపూర్: పెయింటింగ్ కాంట్రాక్టర్ అదృశ్యమైన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం… జగద్గిరిగుట్ట డివిజన్ రింగ్ బస్తీకి చెందిన అమ్మనవోలు వినోద్(36) పెయింటింగ్ కాంట్రాక్టర్ గా పని చేస్తుంటాడు. అయితే గతనెల 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు సెల్ ఫోన్, పర్సు ఇంట్లోనే వదిలి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. ఎంతకీ తిరిగిరాకపోవడంతో భార్య సునీత గురువారం పోలీసులను ఆశ్రయించింది. గత కొంతకాలంగా వినోద్ ఆర్ధిక ఇబ్బందులతో ఉన్నట్లు తెలిసిందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఎవరైనా డబ్బుల కోసం తీసుకెళ్లి ఏమైనా చేశారా..? మరేమైనా జరిగిందా..? అనేది తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story