- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రోగ నిరోధకశక్తిని పెంచే ఆహారం అందించాలి
దిశ, నల్లగొండ: కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు రోగ నిరోధకశక్తిని పెంచే ఆహార పదార్థాలను ప్రభుత్వం అందజేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అన్నారు. ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రాకుండా ఇంటింటికీ నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా సుంకిశాల గ్రామంలో కామ్రేడ్ పైళ్ల మల్లారెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం 400 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓ వైపు కరోనా పరీక్షలు నిర్వహిస్తూ మరోవైపు రోగ నిరోధకశక్తిని పెంచే ఆహార పదార్థాలను పంచాలని సూచించారు. త్వరితగతిన వడ్లు కొనుగోళ్లు పూర్తిచేసి రైతులకు వెంటనే డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, వేముల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
Tags: pailla malla reddy, 14th Anniversary, Essential goods distribution, cpm leader cherupally