‘పాగల్‌’లో ఆ హీరోయిన్ సర్‌ప్రైజ్ ఇస్తుంది : విశ్వక్ సేన్

by Jakkula Samataha |
pagal-poster
X

దిశ, సినిమా : హీరో విశ్వక్ సేన్ ‘పాగల్’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఏకంగా 1600 మంది అమ్మాయిలకు రోజా పూలు ఇచ్చి, ఇంప్రెషన్ కొట్టేస్తూ యూనిక్ ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఆగస్టు 14న సినిమా రిలీజ్ కాబోతుండగా.. మంగళవారం విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా మాట్లాడిన విశ్వక్.. పాగల్ ప్రేమకథ మాత్రమే కాదు ప్రేమ గురించి చెప్పే కథ అని తెలిపారు. మదర్ సెటింమెంట్ భాగమైన సినిమాలో భూమిక తనకు తల్లిగా నటించిందని చెప్పారు.

చాలా మంది తనను లవ్ స్టోరీ చేయమని అడిగారని.. అందుకే ఏకంగా ఐదు లవ్ స్టోరీస్‌ ఉన్న సినిమాతో వస్తున్నానని తెలిపాడు. ఇక టీజర్, ట్రైలర్, సాంగ్స్‌లో కనిపించని ఓ హీరోయిన్ సినిమాలో కనిపించబోతోందని, కచ్చితంగా సర్‌ప్రైజ్ అవుతారని చెప్పాడు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత చాలా రిస్క్ చేసి సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నామని.. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నాడు.

Advertisement

Next Story