- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
OYO : ఐపీఓకు సిద్ధమవుతున్న ఓయో ఎందుకంటే ?
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఆతిథ్య రంగ సంస్థ ఓయో (OYO) భారీ మొత్తం నిధులను సమీకరించేందుకు సిద్ధమవుతోంది. రాబోయే వారంలో ఐపీఓ కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేయనున్నట్టు తెలుస్తోంది. ఓయో సంస్థ ఇప్పటికే వాటాదార్ల నుంచి ఆమోదం సాధించిన సంగతి తెలిసిందే. ఐపీఓ ద్వారా కంపెనీ రూ. 7,400-9,000 కోట్ల నిధులను సమీకరించనుంది. దీని నిర్వహణ కోసం సిటీ, కోటక్ మహీంద్రా కేపిటల్, జేపీ మోర్గాన్ సంస్థలను ఓయో నియమించింది. తాజాగా సెబీ వద్ద దరఖాస్తు చేసుకునేందుకు ఓయో సంస్థ కసరత్తు చేస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఓయో ఇంకా అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు. కాగా, ఓయో సంస్థ ఇప్పటికే భారీగా నిధులను అందుకుంది. ఆగష్టులో మైక్రోసాఫ్ట్ నుంచి సుమారు రూ. 37 కోట్ల పెట్టుబడులు పెట్టింది. అంతకుముందు అంతర్జాతీయ సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి రూ. 5 వేల కోట్ల వరకు నిధులను పొందింది. దీంతో ప్రస్తుతం ఓయో మార్కెట్ విలువ రూ. 70 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా.