తప్పిన ప్రమాదం.. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ లీక్

by Shamantha N |
తప్పిన ప్రమాదం.. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ లీక్
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి చెందుతున్న వేళ ఆక్సిజన్ ఎంత అవసరమో తెలిసిన విషయమే. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఆక్సిజన్ దొరక్క కరోనా బాధితులు మృతి చెందారు. తాజాగా దక్షిణ గోవాలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యాంకు లీకైంది. మెడికల్ ఆక్సిజన్‌ను చిన్న ట్యాంకు నుండి పెద్ద ట్యాంకులోకి సరఫరా చేస్తుండగా ఆక్సిజన్ లీకైనట్టు ఆసుపత్రి అధికారులు తెలిపారు. ఆక్సిజన్ లీకైన కొద్దిసేపటికే ఆసుపత్రి సిబ్బంది ప్రమాదాన్ని గుర్తించడంతో పెను ప్రమాదం తప్పిందని వెల్లడించారు. ఈ ఘటనకు గల కారణాలపై తమకు నివేదిక అందించాలని ఆస్పత్రి యాజమాన్యానికి ప్రభుత్వ అధికారులు సూచించారు.

Advertisement

Next Story