నిర్మల్‌ జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్‌ ప్రారంభం

by Aamani |   ( Updated:2021-11-09 03:25:53.0  )
నిర్మల్‌ జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్‌ ప్రారంభం
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా ఆసుప‌త్రిలో ఆక్సిజ‌న్ కొర‌త‌ను తీర్చేలా.. స్థానికంగా ఉత్పత్తి చేసేందుకు ఏర్పాటు చేసిన ఆక్సిజ‌న్ ప్లాంట్‌ను మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండ‌వ ద‌శ‌లో కొవిడ్ కేసులు అధికంగా న‌మోదు అవ‌డం, శ్వాసకోస స‌మ‌స్యతో తీవ్ర అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరడం, సమయానికి ఆక్సిజ‌న్ అంద‌క చాలా మంది మృతి చెందారని గుర్తు చేశారు. భ‌విష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు నిర్మల్ ఆసుప‌త్రిలో రూ. కోటి వ్యయంతో ఆక్సిజ‌న్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశామ‌న్నారు. ఈ ప్లాంట్‌తో జిల్లా ఆసుప‌త్రికి వ‌చ్చే పేషెంట్లకు స‌రిప‌డా ఆక్సిజ‌న్ ఉత్పత్తి అవుతుందన్నారు.

రూ. 48.83 కోట్ల కేటాయింపు..

జిల్లా ఆసుప‌త్రిగా అప్‌గ్రేడ్ అయిన నిర్మల్ ఏరియా ఆసుప‌త్రి అభివృద్ధి, ఆధునాత‌న‌ వైద్య ప‌రిక‌రాలను స‌మ‌కూర్చుకునేందుకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖ‌ర్ రావు.. రూ. 48.83 కోట్లు మంజూరు చేసినందుకు ఆయ‌న‌కు మంత్రి కృత‌జ్ఞత‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ చిత్రప‌టానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి, జ‌డ్పీ చైర్ ప‌ర్సన్ కే.విజ‌య‌ల‌క్ష్మి రెడ్డి, క‌లెక్టర్ ముషార‌ఫ్ ఫారూఖీ అలీ, మున్సిప‌ల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed