‘ఆక్స్‌ఫర్డ్’టీకా ప్రభుత్వం పంపిణీ చేస్తుంది: సీరం

by Anukaran |   ( Updated:2020-07-27 08:37:17.0  )
‘ఆక్స్‌ఫర్డ్’టీకా ప్రభుత్వం పంపిణీ చేస్తుంది: సీరం
X

పూణె: ఆక్స్‌ఫర్డ్ టీకా ట్రయల్స్ విజయవంతమైతే వాటిని ప్రభుత్వమే పంపిణీ చేస్తుందని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్(ఎస్ఐఐ) ఇండియా వెల్లడించింది. ప్రతిఒక్కరికీ ఈ టీకా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనెకా సంస్థ కలిసి అభివృద్ధి చేస్తున్న కొవిడ్ టీకా ఉత్పత్తికి పూణెకు చెందిన ఎస్ఐఐతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

వచ్చే నెలలో సీరం ఈ టీకాపై భారత్‌లో ట్రయల్స్ నిర్వహించనుంది. ట్రయల్స్ ఫలితాలు సానుకూలంగా వస్తే వీటిని ప్రైవేటు సంస్థల ద్వారా కాకుండా ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా పంపిణీ చేయనున్నట్టు ఎస్ఐఐ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వమే ఈ టీకా కొనుగోలు చేసి పంపిణీ చేస్తుందని, కాబట్టి ప్రజలు నేరుగా కొనుగోలు చేయాల్సిన అవసరముండదని తెలిపింది. పార్సీలకు అవసరానికి మించి ఈ టీకా డోసులు కేటాయిస్తామని ఎస్ఐఐ సీఈవో అడార్ పూనావాలా సరదాగా చేసిన ఓ ట్వీట్ అనంతరం ఈ ప్రకటన వెలువడింది.

Advertisement

Next Story