ఆక్స్‌ఫర్డ్ టీకా ట్రయల్స్ మళ్లీ షురూ

by Anukaran |
ఆక్స్‌ఫర్డ్ టీకా ట్రయల్స్ మళ్లీ షురూ
X

లండన్: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనెకా ఫార్మా (Oxford University, Astra Geneca Pharma) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కరోనా టీకా ట్రయల్స్ పున:ప్రారంభమయ్యాయి. సేఫ్టీ సమీక్షించినవారు టీకా సురక్షితమేనని, ట్రయల్స్ ప్రారంభించవచ్చునని బ్రిటన్‌కు చెందిన మెడిసిన్స్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ(MHRA)కు సూచించారు. ఎంహెచ్ఆర్ఏ (Medicines Health Regulatory Authority) గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ట్రయల్స్ మళ్లీ ప్రారంభించినట్టు ఆస్ట్రా జెనెకా ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా టీకా ట్రయల్స్‌లో భాగంగా ఇప్పటి వరకు సుమారు 18వేల మంది ఈ టీకాను వేసుకున్నారు. యూకేలో నిర్వహిస్తున్న మూడో దశ ట్రయల్స్‌లో ఒక వాలంటీర్‌కు అంతుచిక్కిన ఆరోగ్య సమస్య ఎదురవడంతో ట్రయల్స్‌ను తాత్కాలికంగా నిలిపేశారు. అయితే, సదరు వాలంటరీ అరుదైన స్పైనల్ ఇన్‌ఫ్లేమటరీ డిజార్డర్‌ (Spinal Inflammatory Disorder)తో బాధపడుతున్నారని, న్యూరోలాజికల్ సమస్యతో బాధపడుతున్న ఆయన అనారోగ్యానికి టీకాతో సంబంధం లేదని నిపుణులు చెప్పినట్టు సమాచారం.

యూకేలో ట్రయల్స్ తాత్కాలికంగా నిలిపేయడంతో భారత్ సహా ప్రపంచదేశాలన్నింటిలోనూ ట్రయల్స్ ఆగిపోయాయి. భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) నోటీసులిచ్చిన తర్వాత కొవిషీల్డ్ టీకా ట్రయల్స్ నిలిపేసిన సంగతి తెలిసిందే. తదుపరి అనుమతులు వచ్చిన తర్వాతే ట్రయల్స్ పున:ప్రారంభిస్తామని స్పష్టం చేసింది.

Advertisement

Next Story