- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎర్లీ ఏజ్‌లోనే ఎంత వివక్ష?.. గర్ల్స్‌ను మినీ ఉమన్‌గా చిత్రీకరిస్తున్న సొసైటీ
దిశ, ఫీచర్స్ : బేబీ గర్ల్ – బేబీ బాయ్, అమ్మాయి – అబ్బాయి, మహిళ – పురుషుడు.. ఈ పదాల మధ్య గీతలు చెరిపేసి ఈక్వల్ చేద్దామనుకున్నా ఎవరికీ కుదరడం లేదు. భూమి పుట్టినప్పటి నుంచే ఈ అసమానత ఉన్నా.. తరాలు మారే కొద్దీ మార్పయితే కనిపిస్తుంది గానీ పూర్తిగా సమసిపోయే సమయం కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. తల్లిదండ్రులు అబ్బాయి పుడితే చేసే సెలబ్రేషన్స్‌కు, అమ్మాయి జన్మిస్తే జరుపుకునే వేడుకకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అంతేకాదు కొనిచ్చే బొమ్మలు, చదివించే స్కూల్ నుంచి ఖర్చు పెట్టే ప్రతి పైసాలోనూ ఎంతో కొంత భేదం కనిపిస్తూనే ఉంటుంది. ఇది ఒక్కో ఫ్యామిలీలో ఒక్కో రకంగా ఉండగా, సొసైటీ విషయానికొస్తే ఈ వివక్ష వివిధ రూపాల్లో ప్రతిబింబిస్తుంది. చిరుప్రాయంలోనే ఆడపిల్లల కోసం డిజైన్ చేస్తున్న డ్రెస్‌ల విషయంలోనూ ఈ తేడా సుస్పష్టం. ఈ క్రమంలో పుట్టిన బిడ్డ మీదున్న మమకారం, ఆ పాపపై లోకం చూపిస్తున్న వివక్ష ఓ తండ్రిని ప్రపంచానికే క్లాస్ చెప్పేలా చేసింది. టిక్ టాక్ వీడియోలో పంచుకున్న అభిప్రాయాలు తనకు వరల్డ్ వైడ్ పాపులారిటీ తెచ్చిపెట్టాయి.
టిక్ టాకర్ ఎరికా(@ericasaysstuff).. తన టిక్ టాక్ వీడియోలో సెక్సిజంపై ఆడపిల్లల తండ్రుల అభిప్రాయం తెలుసుకోవాలనుకుంది. యంగ్ ఏజ్‌లోనే లింగ వివక్ష స్టార్ట్ అవుతుందన్న విషయంలో ఎప్పుడు రియలైజ్ అయ్యారో తెలపాలని కోరింది. దీనిపై స్పందించిన 14 నెలల ఎలీనార్ తండ్రి మెఖేల్ వాఘన్.. పిల్లలు పుట్టడంతోనే ఈ వివక్ష ప్రారంభం అవుతుందని, ఇది ఖచ్చితంగా 100 శాతం బట్టల్లో ఉందని తెలిపాడు. ఇది చెడ్డదని తెలుసు కానీ, ఎక్కడి వరకు దారితీస్తుందో తెలియదని సమాధానమిచ్చాడు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన టిక్ టాక్ వీడియో రిలీజ్ చేయగా.. 3.3 మిలియన్ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలిచింది. ప్రతీ ఒక్కరి కళ్లు తెరిపించే విధంగా ఉన్న ఆ వీడియోలో ఆయన ఏం చెప్పాడు?
మైఖేల్.. తన 14 నెలల కుమార్తె కోసం షాపింగ్ చేస్తున్నప్పుడు స్పష్టమైన సెక్సిజం కనిపించిందని వివరించాడు. సొసైటీ ఎంత టాక్సిక్ మైండ్ సెట్‌తో ఉందో అప్పుడే అర్థమైందని, మన పూర్వీకులు వారికి తెలియకుండానే ఈ విషబీజాన్ని మన మైండ్‌లో నాటారని తెలిపాడు. గర్ల్స్ క్లాత్స్‌తో బాయ్స్ క్లాత్స్ కంపేర్ చేసినప్పుడు.. సైజ్ డిఫరెంట్‌గా ఉంటుందని వెల్లడించాడు. యునైటెడ్ స్టేట్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్స్ గ్రోత్ ప్రకారం.. 36 నెలల బాయ్ అండ్ గర్ల్ డ్రెస్ సైజులను పోలిస్తే యావరేజ్ డిఫరెన్స్ హాఫ్ ఇంచ్, పౌండ్‌లో మూడవ వంతు ఉంటుందని, ఆ వ్యత్యాసం ఎందుకని ప్రశ్నించాడు. గర్ల్ క్లాత్స్ చాలా వరస్ట్‌గా ఉన్నాయని, నిజంగా ఈ విషయం తనను బాధిస్తోందని తెలిపాడు. గర్ల్ డ్రెస్‌లకు ఎందుకు రఫుల్స్ ఉండాలి? హైపర్ పింక్ ఎందుకు యాడ్ చేయాలి? గ్లిట్టర్స్ ఉండాల్సిన అవసరమేంటి? అని ప్రశ్నించాడు. కొడుకు కోసం వన్ పీస్ బాతింగ్ సూట్ దొరికినప్పుడు.. కూతురి కోసం ఎందుకు దొరకట్లేదని ప్రశ్నించాడు. బేబీ గర్ల్ దుస్తులు.. బేబీ బాయ్ దుస్తులతో పోలిస్తే ఎందుకు స్మాల్‌గా ఉండాలి? సేమ్ సైజ్‌లో ఎందుకు దొరకట్లేదని అడిగాడు. బాయ్స్ కోసం కంఫర్టబుల్ డ్రెస్‌లు డిజైన్ చేసినప్పుడు.. అమ్మాయి డ్రెస్‌లు మాత్రం మాంసాన్ని ఓ గొట్టంలో వేసినట్లుగా అంత అన్‌కంఫర్టబుల్‌గా, టైట్‌గా ఎందుకు డిజైన్ చేయాలి? అని క్వశ్చన్ చేశాడు మైఖేల్. అప్పుడే పుట్టిన ఆడ, మగ బిడ్డల మధ్య శరీరంలో ఎలాంటి తేడా లేనప్పుడు.. అప్పుడే ఆడ, మగ అని వేరు చేస్తూ వివక్ష చూపడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించాడు.
ఈ వీడియోకు ఇప్పటికే మిలియన్ వ్యూస్ రాగా.. కామెంటరీ బాక్స్ నిండిపోయింది. సొసైటీ గర్ల్స్‌ను గర్ల్స్‌లా ఉండనివ్వకుండా మినీ ఉమన్‌గా ఎందుకు చూస్తోందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. లింగ వివక్ష అనేది పుట్టగానే స్టార్ట్ కావడం చాలా బాధాకరమని అంటున్నారు. చిన్నపిల్లలకు కావాల్సింది కంఫర్టబుల్ క్లాత్స్ మాత్రమే కదా! అలాంటప్పుడు సొసైటీ నుంచి ఈ వ్యత్యాసాన్ని రూపుమాపాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. అమ్మాయిల పట్ల లైంగిక వేధింపులు, అపహాస్యంగా మాట్లాడటం వంటివి 25-30 ఏళ్ల కంటే 14 ఏళ్ల వయసులోనే ఎక్కువగా జరుగుతున్నాయని, అయితే ఈ వీడియో చూశాక మాత్రం.. ఆడపిల్ల పుట్టింది మొదలు ఇలాంటి వివక్ష ఎదుర్కొంటోందని తెలిసి ఆందోళన కలుగుతున్నదని తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.