- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గాంధీలో మరోసారి మోగిన సమ్మె సైరన్..
దిశ, వెబ్‌డెస్క్: కరోనా నేపథ్యంలో మరోసారి గాంధీ ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమ్మె బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. అందుకు సంబంధించి సమ్మె నోటీసును ఆదివారం వైద్యాధికారులకు అందజేశారు. గతంతో సమ్మె చేసిన సమయంలో వారి డిమాండ్లను నేరవేరుస్తామని అధికారులు రాత పూర్వకంగా హామీ ఇచ్చి రెండు నెలలు గడచినా ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని వివరించారు.
ఈ నేపథ్యంలోనే ఈనెల 22నుంచి మరోసారి సమ్మెకు దిగనున్నట్లు ఔట్ సోర్సింగ్ సిబ్బంది నోటీసులో పేర్కొన్నారు. అసలే రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతూ ఉండటంతో పాటు కరోనా వారియర్లు కూడా ఈ మధ్య వైరస్ బారిన పడుతున్నారు. గాంధీలో రోగుల సంఖ్యకు సరిపడా వైద్య సిబ్బంది లేరు. చాలామంది కరోనా వారియర్లు మహమ్మారి బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఇలాంటి సమయంలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది మళ్లీ సమ్మెకు దిగితే గాంధీలో కరోనా రోగుల పరిస్థితి ఎంటనీ అందరూ చర్చించుకుంటున్నారు.
Read Also…