TSలో ఇవాళ 2,216 కేసులు..!

by  |
TSలో ఇవాళ 2,216 కేసులు..!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసుల వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 2,216 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,57,096కు చేరుకోగా, జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 338 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 31,607 యాక్టివ్ కేసులుండగా.. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు డిశ్చార్జి అయిన సంఖ్య 1,24,528 చేరుకుంది. గడచిన 24 గంటల్లో కరోనాతో 11 మంది మృతి చెందగా.. తాజా మరణాలు కలుపుకుని మొత్తం కరోనా మృతుల సంఖ్య 961కు చేరింది.



Next Story