- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Keerthy Suresh: ఓటీటీలోకి వచ్చిన స్టార్ హీరోయిన్ సినిమా ‘రఘుతాత’.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
దిశ, సినిమా: కథానాయిక కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'రఘుతాత'. సుమన్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని హోంబళే ఫిల్మ్ సంస్థ నిర్మించింది. విజయ్ కిరగందూర్ నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల తమిళ, కన్నడ భాషల్లో థియేటర్‌లో ఈ చిత్రం విడుదలైంది. కాగా ఈ చిత్రం ఈ నెల 13 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 'రఘు తాత' ఓటీటీలోకి రానుంది. ఈ నేపథ్యంలో కీర్తిసురేష్ మాట్లాడుతూ 'నమ్మిన దాని కోసం నిలబడే ధైర్యశాలి పాత్రను ఈ చిత్రంలో పోషించాను. ఆ పాత్రను ఛాలెంజ్‌గా తీసుకుని నటించాను. ఇప్పుడు ఓటీటీ ద్వారా ఈ చిత్రం అందరికి చేరువ అవుతుండటం సంతోషంగా వుంది' అన్నారు. దర్శకుడు సుమన్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘రఘుతాత’ సినిమా మా జీవితంలో ఓ మరుపురాని జర్నీగా నిలుస్తుంది. యూనివర్శల్ పాయింట్‌తో రూపొందిన ఈ చిత్రం భాషా, ప్రాంతం అన్న తేడా లేకుండా అందరినీ అలరించగలిగింది. ఇక ZEE5లో ప్రపంచ డిజిటల్ ప్రీమియర్‌తో ఈ చిత్రం అందరి మనసులు గెలుచుకుంటుంది' అన్నారు.