- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెగా కోడలు లావణ్య త్రిపాఠి ‘మిస్ పర్‌ఫెక్ట్’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి, మెగా హీరో వరుణ్ తేజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరు గత ఏడాది నవంబర్ 1న ఇటలీలో మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ పలువురు బంధువుల మధ్య జరుపుకున్నారు. ఆ తర్వాత హనీమూన్‌కు కూడా వెళ్లి వచ్చారు.ఇక లావణ్య త్రిపాఠి పెళ్లి అయినప్పటికీ నుంచి ఇంటి బాధ్యతలు చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది. వరుణ్ తేజ్ మాత్రం వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. అయితే పెళ్లి తర్వాత లావణ్య సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినట్లు సోషల్ మీడియా వేదికగా ఇటీవల ప్రకటించింది. ‘మిస్ పర్‌ఫెక్ట్’ లవ్ కామెడీ వెబ్ సిరీస్‍గా రూపొందుతున్న చిత్రంలో మెగా కోడలు కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సిరీస్‍కు స్కైలాబ్ ఫేమ్ విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించారు. బిగ్‍బాస్ ఫేమ్ అభిజిత్ ఈ సిరీస్‍లో మరో ప్రధాన పాత్ర చేశారు.
మిస్ పర్‌ఫెక్ట్ సిరీస్ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. జనవరి 22న ఈ సిరీస్ ట్రైలర్ కూడా విడుదలై యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. తాజాగా, స్ట్రీమింగ్ డేట్‌ను కూడా లాక్ చేసుకున్నట్లు సమాచారం. మిస్ ఫర్‌ఫెక్ట్ ఓటీటీ హక్కులను డిస్నీ+ హాట్‌స్టార్ దక్కించుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ హాట్‌స్టార్ సంస్థ నిర్వాహకులు ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ సిరీస్ ఫిబ్రవరి 2న స్ట్రీమింగ్ కాబోతుంది. ఇది పర్‌ఫెక్ట్ లవ్ స్టోరీనా.. కాదా? గందరగోళం, క్రేజీనెస్, క్యూట్‌నెస్ ఉండే ఈ రోమ్ కామ్ మీ హృదయాన్ని తాకుతుంది. మిస్ పర్‌ఫెక్ట్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఫిబ్రవరి 2న అందుబాటులోకి వస్తుంది’’ అంటూ రాసుకొచ్చారు. ఈ విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.