మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘గొర్రె పురాణం’.. అధికారిక ప్రకటన విడుదల

by Hamsa |   ( Updated:2024-10-07 15:29:29.0  )
మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘గొర్రె పురాణం’.. అధికారిక ప్రకటన విడుదల
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ హీరోగా నటించిన ‘గొర్రె పురాణం’ బాబీ దర్శకత్వంలో తెరకెక్కింది. దీనిని ప్రవీణ్ రెడ్డి నిర్మించగా.. సెప్టెంబర్ 20న థియేటర్స్‌లో విడుదలై మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా, గొర్రె పురాణం డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. థియేటర్స్‌లో విడుదలైన మూడు వారాలకే ఈ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. అక్టోబర్ 10 నుంచి ‘గొర్రె పురాణం’ ఆహాలోకి రాబోతుంది.

ఈ విషయాన్ని ఆహా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. ‘‘పురాణాలందు ఈ గొర్రె పురాణం వేరయా! అక్టోబర్ 10 న ఆహాలో వస్తుందయా!!’’ అనే క్యాప్షన్ జత చేశారు. కాగా, సుహాస్ విభిన్న కథలు ఎంచుకుంటూ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను సెలబ్రిటీలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఓకే ఏడాదిలో నాలుగు సినిమాలు శ్రీరంగనీతులు, ప్రసన్న వదనం, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, గొర్రె పురాణం విడుదల చేయడం విశేషం. ఇప్పుడు సుహాస్ ఐదవ మూవీ ‘జనక అయితే గనక’ అక్టోబర్ 12న విడుదల కాబోతుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ అయిపోయారు.

Advertisement

Next Story