- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ఓటీటీలోకి రాబోతున్న ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’.. ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే?
దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినప్పటికీ తొందరలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇక భారీ బడ్జెట్ మూవీస్ విషయం పక్కన పెడితే మీడియం బడ్జెట్, చిన్న చిత్రాలు థియేటర్స్‌లో విడుదలైన నెలరోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చేస్తూ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటున్నాయి. బాక్సాఫీసు వద్ద మెప్పించలేని మూవీస్ కూడా ఓటీటీలో ట్రెండ్ సెట్ చేస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇటీవల విడుదలైన కామెడీ ఎంటర్‌టైనర్ ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయినట్లు సమాచారం.
ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ హక్కులు ప్రముఖ సంస్థ ఆహా సొంతం చేసుకున్నట్లు త్వరలో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు ఆహా ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. ‘‘మేడం, సర్ త్వరలో ఆహాలో సందడి చేయబోతున్నారు. త్వరలోనే మారుతీ నగర్ సుబ్రమణ్యం ఓటీటీలోకి రాబోతుంది’’ అని రాసుకొచ్చారు. కానీ తేదీని మాత్రం వెల్లడించలేదు. అయితే ఈ మూవీ సెప్టెంబర్ 20న స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో సీనియర్ నటుడు రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించగా.. ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్మ పసుపులేటి, హర్షవర్ధన్ తదితరులు నటించారు.
దీనిని స్టార్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబితా సుకుమార్ నిర్మించింది. అయితే మారుతీ నగర్ సుబ్రమణ్యం ఆగస్టు 23న థియేటర్స్‌లో విడుదలై ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. అంతేకాకుండా పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు కూడా అందుకుంది. అయితే ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ సినిమా ఓటీటీలోకి రాబోతుండటంతో ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.