- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Gautham Gambhir : మేక్ ఆర్ బ్రేక్.. ఆసీస్ సిరీస్ తర్వాత గౌతమ్ గంభీర్ ఔట్?
దిశ, స్పోర్ట్స్ : టీం ఇండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గౌతమ్ గంభీర్‌కు సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. హెడ్ కోచ్‌గా మంచి ఫలితాలు సాధిస్తాడని ఆయన సన్నిహితులు వేసిన అంచనాలు అతి తక్కువ కాలంలో తారుమారుఅయ్యాయి. కోత్‌కతా నైట్ రైడర్స్‌కు ఐపీఎల్ ట్రోఫీ అందించి నేరుగా ఇండియా హెడ్ కోచ్‌గా ఆయన బాధ్యతలు చేపట్టాడు. కానీ ఇండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రీలంకతో వన్డే సిరీస్ ఓటమి, న్యూజిలాండ్‌తో స్వదేశంలో 0-3తో టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ ఆయనను ఇరకాటంలోకి నెట్టాయి. టీం ఇండియా పర్ఫామెన్స్‌తో వెంటనే బీసీసీఐ పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడింది.
గంభీర్‌కు ‘మేక్ ఆర్ బ్రేక్’గా మారిన సిరీస్
దీంతో ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ గంభీర్‌కు ‘మేక్ ఆర్ బ్రేక్’ అన్న చందంగా మారింది. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ గంభీర్‌కు మాత్రం లాంగ్ ఫార్మాట్‌లో కోచ్‌గా కొనసాగే అంశంలో బిగ్ ‘టెస్ట్’(పరీక్ష) కానుంది. ఆస్ట్రేలియాలో భారత జట్టు విఫలమైతే గంభీర్ టెస్ట్ హెడ్ కోచ్ పదవి ఊడినట్లే అని తెలుస్తోంది. అయితే బీసీసీఐ వైట్ బాల్ కోచ్‌గా మాత్రం గంభీర్‌నే కొనసాగించనున్నట్లు సమాచారం. జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భారత్ ఫెయిల్ అయితే టెస్ట్ కోచ్ పదవి నుంచి గంభీర్‌ను తప్పించి ఆ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌ను కొనసాగించనున్నట్లు సమాచారం. అయితే వన్డే, టీ20లకు మాత్రం గంభీర్‌నే కొనసాగించాలని భారత క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ మార్పునకు గంభీర్ అంగీకరిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ అనంతరం టఫ్ డెసిషన్ తీసుకునేందుకు బీసీసీఐ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం గంభీర్ ఆరు గంటల పాటు బీసీసీఐ సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్, వన్డే, టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మతో సమావేశమయ్యారు. న్యూజిలాండ్ సిరీస్‌లో వైఫల్యం గురించి ఈ భేటీలో చర్చించినట్లు తెలిసింది. జట్టు కూర్పు అంశంలో గంభీర్‌కు బోర్డుకు మధ్య బేధాభిప్రాయాలు ఉన్నట్లు తెలిసింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సమయం దగ్గర పడుతున్నందున టీమ్‌కి ఈ అంశాలు మేలు చేయవనే నిర్ణయానికి వారంతా వచ్చినట్లు సమాచారం.