Canada Study Visa: భారత విద్యార్థులకు కెనడా షాక్!

by Mahesh Kanagandla |   ( Updated:2024-11-09 17:04:38.0  )
Canada Study Visa: భారత విద్యార్థులకు కెనడా షాక్!
X

దిశ, నేషనల్ బ్యూరో: కెనడా(Canada), భారత్‌ మధ్య దౌత్య సంక్షోభం ఒకవైపు, వచ్చే ఏడాది కెనడాలో ఎన్నికలున్న నేపథ్యంలో ఆ దేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉన్నట్టుండి కెనడా దేశంల స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్(ఎస్‌డీఎస్) ప్రోగ్రామ్‌ను రద్దు చేసింది. ఇది ఇతర దేశాల కంటే భారత విద్యార్థుల(Indian Students)పై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. కేవలం విదేశీ విద్యార్థులపైనే కాదు, ప్రతియేటా అనుమతించే పర్మినెంట్, నాన్ పర్మినెంట్ రెసిడెంట్ల సంఖ్యనూ కెనడా కుదిస్తున్నది. తక్కు వ నైపుణ్యంగల కార్మికులూ కెనడాపై ఆశలు వదిలిపెట్టుకునే పరిస్థితులు రావొచ్చు. ఎస్‌డీఎస్(SDS) కింద మన విద్యార్థులు కెనడాలో చదువుకోవడం కోసం దరఖాస్తు చేసుకుంటే సుమారు 20 రోజుల్లో అప్రూవల్స్ వచ్చేవి. ఇప్పుడు రెగ్యులర్ మోడ్‌లో దరఖాస్తు చేసుకుంటే కొన్ని నెలల సమయం పట్టొచ్చు.

ఎస్‌డీఎస్ స్కీం అంటే ఏమిటీ?

2018లో కెనడా ప్రభుత్వం తెచ్చిన ఎస్‌డీఎస్ స్కీం కింద ఆ దేశంలో చదువుగోరే(Study) విద్యార్థులు సులువుగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశముండేది. అటంకాలు లేకుండా స్వల్ప వ్యవధిలోనే వారి వీసాలకు అప్రూవల్ వచ్చేది. 20 పని దినాల్లో కెనడా స్టడీకి చేసుకున్న దర్యాప్తు‌కు గ్రీన్ సిగ్నల్ పడేది. ఈ స్కీం కింద దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులకు అప్రూవల్ రేటింగ్ కూడా ఎక్కువ. ఇండియా, చైనా, బ్రెజిల్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, కొలంబియా, కోస్టారికా, మొరాకో, పెరూ, సెనెగల్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, వియత్నాం, యాంటిగ్వా బార్బుడా, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్ వంటి దేశాల విద్యార్థుల ఈ స్కీం కింద దరఖాస్తు చేసుకోవడానికి అవకాశమిచ్చింది. ఇందులో సింహభాగం భారత విద్యార్థుల దరఖాస్తులే ఉండేవి. కెనడా ఫారీన్ విద్యార్థుల్లో అత్యధికులు భారతీయులే ఉంటారు. 4,27,000 మంది భారత విద్యార్థులు కెనడాలో చదువుతున్నారు.

కానీ, కెనడా తన విధానాన్ని మార్చుకుంటున్నది. విదేశీ విద్యార్థుల అనుమతులను ఈ ఏడాది 35 శాతం తగ్గిస్తున్నామని ఈ ఏడాది సెప్టెంబర్‌లో కెనడా పీఎం జస్టిన్ ట్రూడో పేర్కొన్నారు. ఆ తర్వాతి సంవత్సరం ఈ సంఖ్య మరో పది శాతం తగ్గుతుందని వివరించారు. తమ దేశంలో వలసలు ఆర్థికాభివృద్ధికి సహాయపడుతున్నా.. వ్యవస్థలోని కొన్ని శక్తులు దుర్వినియోగం చేసుకుంటున్నాయని ట్వీట్ చేశారు. ఈ నిర్ణయం భారత్, కెనడాల మధ్య సంబంధాలు క్షీణించిన సందర్భంలో తీసుకోవడం గమనార్హం.

వలసలపై వెనకడుగు..

కేవలం విదేశీ విద్యార్థుల సంఖ్యను తగ్గించుకోవడమే కాదు.. వలసదారులపై కెనడా దాని విధానమే మార్చుకుంటున్నది. గతంలో తరహా ఇకపై లో స్కిల్డ్ వర్కర్స్‌ను తీసుకోవడంపై ఎక్కువ ఆసక్తి చూపేలా లేదు. గతనెల 24వ తేదీన కెనడా ఇమ్మి్గ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది 3,95,000 మందిని శాశ్వత నివాసులుగా అనుమతిస్తామని, గతేడాది(4,85,000) తో పోల్చితేఅనుమతులు పది శాతం తగ్గాయి. తాత్కాలిక నివాసితులపైనా యాక్షన్ తీసుకోనుంది. ఈ ఏడాది సుమారు 8 లక్షల మందిని కెనడా నాన్ పర్మినెంట్ రెసిడెంట్లుగా తీసుకుంది. 2025లో 4,46,000 మంది నాన్ పర్మినెంట్ రెసిడెంట్లకు అనుమతులు ఇచ్చే అవకాశముండగా, 2026లో మరింత తగొచ్చని చెబుతున్నారు. ఇక 2027 నాటికి 17,400మంది నాన్ పర్మినెంట్ రెసిడెంట్లను మాత్రమే కెనడా తీసుకోనుంది.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed