Congress: కేటీఆర్‌కు జైలుకు వెళ్లాలని ఉబలాటం.. మాజీ మంత్రి రవీంద్ర నాయక్ హాట్ కామెంట్స్

by Ramesh Goud |   ( Updated:2024-11-09 16:34:45.0  )
Congress: కేటీఆర్‌కు జైలుకు వెళ్లాలని ఉబలాటం.. మాజీ మంత్రి రవీంద్ర నాయక్ హాట్ కామెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ మంత్రి కేటీఆర్(KTRBRS) కు జైలుకు వెళ్లాలని ఉబలాటం ఎక్కువైందని, ఈ పిల్ల అనకొండ తనను అరెస్టు చేయాలని ఎదురు చూస్తున్నాడని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రవీంద్ర నాయక్(Ex-minister Ravindra Naik) శనివారం ఒక ప్రకటనలో ఘాటు విమర్శలు(Criticizes) చేశారు. తెలంగాణా ప్రజల దెబ్బకు అసలు అనకొండ కేసీఆర్(KCRBRS).. ఫాంహౌజ్ కు పరిమితమయ్యారని విమర్శలు చేశారు. తెలంగాణాను అప్పుల ఊబిలో నెట్టి, ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా, తెలంగాణాను ఆగంచేశాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టి, అశాంతికి గురిచేసి చివరకు కేసీఆర్ ఫాంహౌజ్ లో చేరి ముఖం చాటేశారని విమర్శలు చేశారు.

ఇకపోతే ప్రధాని మోడీ(PM Modi) గతంలో కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ఏటీఎంగా మారిందని, లక్షల కోట్లు సంపాదించుకున్నారని ఆరోపణలు చేశారని, కానీ వారిపై ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఫైరయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం గతంలో చేసిన అవినీతిపై కాంగ్రెస్ చర్యలు చేపడుతుండగా బీజేపీ నాయకులు ముఖ్యంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) సన్నాయి నొక్కులు నొక్కడానికి సిగ్గుపడాలని రవీంద్ర నాయక్ ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డి హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, దేశభద్రతకు, దేశ ద్రోహులకు సంబంధించిన డ్యాకుమెంట్ల తస్కరణ, క్విడ్ ప్రోకో కింద ల్యాండ్, శాండ్, లిక్కర్, డ్రగ్స్ లాంటి అనేక కుంభకోణాలు జరిగాయని పేర్కొన్నారు. ఆ సమయంలో కిషన్ రెడ్డి వద్ద ఉన్న కేంద్ర హోంశాఖ నిఘా సంస్థలు, సెంట్రల్ ఇంటెలిజెన్స్, ఐబీ, సీబీఐలు ఏం చేశాయని రవీంద్రనాయక్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు కేంద్ర కేబినెట్ కు ప్రమోషన్ పొందిన కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని మాజీ మంత్రి రవీంద్ర నాయక్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story