- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓట్టర్ సెక్స్.. ఆ మొక్కల మధ్య చేస్తే..!
దిశ, ఫీచర్స్ : ప్రకృతిలో జీవుల మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. ఈ క్రమంలో ఆహారం కోసం ఒక జీవి మరొక జీవి మీద ఆధారపడటం చూశాం. కానీ ఒక జంతుజాతి సెక్స్.. మొక్కలపై ప్రభావం చూపుతుందని ఊహించగలమా. కానీ ఇది జరుగుతుందని ఆధారాలతో సహా శాస్త్రవేత్తలు రుజువు చేశారు. సముద్రజంతువులు అయిన ఓట్టర్‌లు సెక్స్ కోసం.. సీగ్రాస్ మొక్కలను స్థావరంగా చేసుకునే క్రమంలో ఏం జరుగుతుంది? ఆడ, మగ ఓట్టర్‌ల మధ్య శృంగారం.. సీ గ్రాస్ పెరుగుదలకు ఏ విధంగా కారణమవుతుంది? ఎలాంటి సంపర్కం లేకుండానే కొత్త మొక్కలు పెరగడంలో ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనేది తాజా అధ్యయనం ద్వారా వెల్లడించారు.
సముద్రపు నీటిలో జీవించే ఓట్టర్ అనే క్షీరదం తన భాగస్వామితో శృంగారం కోసం సీ గ్రాస్ అనే సముద్రపు గడ్డిని ఆశ్రయిస్తాయని తెలుస్తోంది. ఈ సమయంలో వాటిని నివాసాలుగా ఏర్పరుచుకునే ఓట్టర్స్.. ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేటప్పుడు ఓ మార్క్ వదలడంతో పాటు ఆ గడ్డిని చెల్లాచెదురు చేస్తాయని తెలుస్తోంది. తద్వారా ఈ గడ్డి మరింత ఏపుగా పెరిగేందుకు, పూలు పూసేందుకు కారణమవుతాయని తెలుస్తోంది. అంతేకాదు ఈ ప్రక్రియ వల్ల అవి శృంగారం కోసం నివసించే ప్రాంతాల్లో సీగ్రాస్ నార్మల్ కన్నా ఎక్కువ సైజులో పెరుగుతుందని గుర్తించారు శాస్త్రవేత్తలు. ఎలాంటి సంపర్కం లేకుండానే కొత్త మొక్కలు పుట్టుకొస్తున్నాయని కనుగొన్నారు.
గడ్డి మొక్కల వేర్లను మరింతగా విస్తరించడం ద్వారా జన్యుపరమైన మార్పులు చోటుచేసుకుంటున్నట్లు తేలింది. చివరకు వాటి డీఎన్ఏలోని స్వభావం నీటిలోని పర్యావరణ మార్పుల ద్వారా మరింతగా వృద్ధి చెందడానికి దోహదపడుతున్నట్లు తేలింది. అంతేకాదు పర్యావరణాన్ని సమతుల్యం చేసేందుకు కూడా సీ గ్రాస్ సానుకూల పాత్ర పోషిస్తున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. కార్బన్‌ను ఎక్కువగా స్వీకరించి తమ వేళ్ల కింద భాగంలో దాచడం వలన ప్రకృతికి హాని కలగకుండా సాయపడుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. యూకేలోని చాలా దీవుల్లో దాదాపు 92 శాతం మేర సీ గ్రాస్ మాయం కావడంతో పర్యావరణ మార్పులు వచ్చాయని, సీ గ్రాస్ పొదలు ఎక్కువగా ఉన్న చోట వాతావరణ మార్పులు పెద్దగా జరగలేదని గ్రహించారు.
ఓట్టర్లు ఎక్కువగా సీ గ్రాస్ పొదలను వాటి నివాసానికి వాడుకుంటున్నందువల్ల అవి దెబ్బతినకుండా చూసుకుంటున్నాయని.. ఫలితంగా పర్యావరణానికి మేలు చేస్తున్నట్లు గ్రహించారు. ఓట్టర్లు ఆశ్రయంగా మలుచుకున్న పదిహేను సీగ్రాస్ స్థావరాలపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు.. అందులో ఆరు చోట్ల దాదాపు 30 ఏళ్లుగా నివాసం ఉంటున్నట్లు తెలిపారు. మరో మూడు పొదల దగ్గర గడచిన పదేళ్లుగా వచ్చి పోతున్నట్లు గుర్తించిన వారు.. మరో ఆరు చోట్ల మాత్రం మనుషులే సముద్రపు వేటకు వెళ్లినప్పుడు ఆ పొదలను విధ్వంసం చేసినట్లు వివరించారు. ఓట్టర్లు స్థావరంగా ఉన్న ప్రాంతాల్లో సీ గ్రాస్ ఎక్కువగా ఉంటున్నందున పర్యావరణ సమతుల్యతతో పాటు సీ గ్రాస్ పొదలు మరింత ఏపుగా పెరగడానికి కారణమవుతున్నట్లు పేర్కొన్నారు.