ఏపీలో ఆరెంజ్, గ్రీన్ జోన్‌లివే!

by srinivas |
ఏపీలో ఆరెంజ్, గ్రీన్ జోన్‌లివే!
X

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కంటైన్‌మెంట్ జోన్ల వివరాలను వెల్లడించింది. ఈ జాబితా ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఏడు జిల్లాలు ఆరెంజ్ జోన్‌లో ఉంటే.. ఒకే ఒక్క జిల్లా గ్రీన్ జోన్‌లో ఉంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ సడలింపు ఏపీలో అమలు కానున్నట్టు తెలుస్తోంది.

కంటైన్‌మెంట్ జోన్లను ఏ ప్రాతిపదికన విభజించారంటే… కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గుర్తించిన నిర్ధిష్ఠ ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్ అంటారు. అలాగే కరోనా వైరస్ సోకే అవకాశమున్న జోన్లను బఫర్ జోన్ అంటారు. అత్యధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదై, ఇన్‌ఫెక్షన్ శాతం ఉండి, కేసులు పెరుగుతున్న ప్రాంతాలు రెడ్ జోన్‌లో ఉంటాయి.

ఆరెంజ్‌ జోన్‌లో కరోనా పాజిటివ్ కేసులు తక్కువగా ఉన్న ప్రాంతాలను ఆరెంజ్ జోన్‌లంటారు. అలాగే కరోనా పాజిటివ్ కేసులు నమోదై రెడ్ జోన్‌గా ఉంటూ.. ఆస్పత్రి నుంచి కోలుకుని, వైరస్ వ్యాప్తి కాకుండా నిలకడగా ఉంటే వాటిని తొలుత ఈ ఆరెంజ్ జోన్‌లోనే కలుపుతారు. అనంతరం కేసులు నమోదు కాకుంటే ఆ జోన్‌ను గ్రీన్ జోన్ అంటారు.

ఈ లెక్కన ఏపీలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాలను ఆరెంజ్ జోన్‌లుగా పేర్కొంది. ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాని విజయనగరం జిల్లాను మాత్రం గ్రీన్ జోన్ లో చేర్చింది. రెడ్ జోన్‌లో ఐదు జిల్లాలు ఉన్న సంగతి తెలిసిందే.

Tags: ap, orenge zone, red zone, green zone, containment zones, corona positive

Advertisement

Next Story

Most Viewed