- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతిపక్షాలను నమ్మొద్దు.. కేసీఆర్ రైతు బాంధవుడు.. సుభాష్ రెడ్డి..
దిశ, మెదక్: సీఎం కేసీఆర్ సూచనలతో రైతులు యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ప్రతి పక్షాల ఉచ్చులో పడవద్దని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎంఎల్‌సి శేరి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. హవేలి ఘనపూర్ మండలం కూచన్ పల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. యాసంగిలో ఆరుతడి పంటలు మొక్క జొన్న, పొద్దు తిరుగుడు, మినుములు, జనుము, గుమ్మడి, పత్తి పంటలను సాగు చేస్తున్నానని తెలిపారు.
ఈ సందర్భంగా ఎంఎల్‌సి గారు మాట్లాడుతూ.. కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, వారి మాటలను రైతులు నమ్మడం లేదని అన్నారు. ధాన్యం కొనమని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంటే ఇక్కడి బీజేపీ నాయకులు వరి వేయమని రైతులను రెచ్చ గొడుతున్నారని ఎంఎల్‌సి పేర్కొన్నారు. తెలంగాణలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతల వలన నూక శాతం పెరుగుతుందని, వర్షా కాలంలో ఒక క్వింటల్ బియ్యంలో 60 నుంచి 65 క్వింటాళ్ల బియ్యం వస్తే యాసంగిలో 30 నుంచి 40 క్వింటాళ్ల బియ్యం వస్తుందని తెలిపారు.
ఈ మాత్రం కనీస అవగాహన లేకుండా ప్రతిపక్ష పార్టీలు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎంఎల్‌సి పేర్కొన్నారు. తెలంగాణలోని నిజామాబాద్, కామారెడ్డి లాంటి జిల్లాల్లో 95 శాతం ధాన్యం కొనుగోలు చేశామని, దక్షిణ జిల్లాల్లో కోతలు పూర్తి కాగానే ధాన్యం సేకరణ సాగుతుందని.. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనడం లేదని ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఎంఎల్‌సి తెలిపారు. సిఎం కేసిఆర్ రైతు బాంధవుడని, ఆయన అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని ఎంఎల్‌సి ప్రతిపక్షాలను ప్రశ్నించారు.