- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పార్లమెంటులో పెగాసస్‌పై చర్చించాలి.. రాష్ట్రపతికి విపక్షాల లేఖ
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఆశించినమేర చర్చ జరిగిన రోజు లేదు. ప్రతి రోజూ ఉభయ సభలూ వాయిదాల మీద వాయిదా పడుతూనే ఉన్నాయి. స్పైవేర్ పెగాసస్, రైతు ధర్నాల అంశాలపై చర్చించాలని ప్రతిపక్షాల ఆందోళనలు ఆగడం లేదు. ప్రభుత్వం చర్చించడం లేదు. మంగళవారమూ ఇవే సీన్లు రిపీట్ అయ్యాయి. దీంతో ఉభయ సభలు బుధవారానికి వాయిదా పడ్డ తర్వాత ఏడు విపక్ష పార్టీ ఎంపీలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు.
పెగాసస్ స్పైవేర్, రైతు ధర్నాలపై చర్చించాలని కేంద్రానికి ఆదేశించాలని అభ్యర్థించినట్టు ఎన్సీపీ నేత సుప్రియా సూలే తెలిపారు. బీఎస్పీ, ఆర్ఎల్‌పీ, శిరోమణి అకాలీదళ్, నేషనల్ కాన్ఫరెన్స్, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ నేతలు ఈ లేఖ రాశారు. ప్రతిపక్షాల నిరసనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభ్యులు సభా మర్యాదను కాపాడాలని, ఫలప్రద చర్చ జరగడానికి సహకరించాలని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా కోరారు. కాగా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడ్డారు. సభా మర్యాదను గంగలో కలుపుతున్నారని తెలిపారు. మంగళవారం నాటి చర్చలో గ్రామీణం, రైతులకు సంబంధించి 15 ప్రశ్నలున్నాయని, రైతులపట్ల సానుకూలంగా ఉంటే చర్చించాలన్నారు.