ఎమ్మెల్యే రోజాకు తలనొప్పి.. మంత్రి పెద్దిరెడ్డికి ప్రత్యర్థి వర్గం ఫిర్యాదు

by srinivas |
mla candidates
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేర్గాంచిన ఎమ్మెల్యే రోజాకు అసమ్మతి సెగ వేధిస్తోంది. సొంత పార్టీ నేతలే సొంత నియోజకవర్గంలో ప్రత్యర్థులుగా మారారు. నిండ్ర ఎంపీపీ వ్యవహారంలో ఎంపీటీసీ అభ్యర్థులు ఏకంగా ఎమ్మెల్యే రోజాపై తిరుగుబావుటా ఎగురవేశారు. దీంతో ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. దీంతో అటు రోజా వర్గం.. ఇటు చక్రపాణిరెడ్డి వర్గీయులు మంత్రి పెద్దిరెడ్డి రామంద్రారెడ్డిని ఆశ్రయించారు. దీంతో నిండ్ర ఎంపీపీ వ్యవహారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోర్టుకు చేరింది. వైసీపీ నేత చక్రపాణిరెడ్డి వర్గీయులపై ఎమ్మెల్యే రోజా ఫిర్యాదు చేశారు. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

రోజా కలిసి వెళ్లిపోయిన తర్వాత చక్రపాణిరెడ్డి వర్గీయులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిశారు. వైసీపీ నేతలను రోజా చులకనగా చూస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. భాస్కర్ రెడ్డినే ఎంపీపీగా ఎన్నుకుంటామని తేల్చి చెప్పారు. రోజాను ఎమ్మెల్యేగా తాము గెలిపిస్తే మాపైనే అజమాయిషీ చేస్తోందని విరుచుకుపడ్డారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చేది ఎవరో నగరి ప్రజలకు తెలుసునన్నారు. గెలిచిన ఎంపీటీసీలనుపార్టీ నుండి సస్పెండ్ చేస్తానంటూ రోజా బెదిరిస్తోందన్నారు. మమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి రోజా ఎవరని ప్రత్యర్థి వర్గాలు నిలదీశారు.

Advertisement

Next Story

Most Viewed