- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరించొద్దు
దిశ, న్యూస్‌బ్యూరో: సింగరేణి బొగ్గుగనుల ప్రైవేటీకరణ ప్రతిపాదనలను ఉపసంహరించుకునేలా సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. గురువారం హైదరాబాద్ నారాయణగూడ ఫ్లై ఓవర్ వద్ద బొగ్గు గనుల ప్రైవేటీకరణ ఆలోచనలు వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్ష నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఐ(ఎం) కార్యదర్శి వర్గ సభ్యులు రాములు, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పాల్గొన్నారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ సింగరేణి పరిధిలో 11బొగ్గు గనులను వేలం వేసేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను వ్యతిరేకిస్తున్నామన్నారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కాలరీస్‌లో రెండు రోజులుగా కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్నాయని తెలిపారు. గనులు వేలం వేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వాటిని ప్రైవేటీకరణ చేస్తే సింగరేణి నిర్వీర్యమవుతుందని, కార్మికులు, ఉద్యోగాలు ప్రమాదంలో పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం స్పందించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని చాడా వెంకటరెడ్డి పేర్కొన్నారు.
సింగరేణి కాలరీస్ ఉత్తర తెలంగాణ ప్రజలకు ఉపాధి కల్పణలో గుండెకాయలాంటిదని కోదండరాం వ్యాఖ్యానించారు. అట్టడుగు వర్గాలకు ఉద్యోగాలు వచ్చాని తెలిపారు. మరోవైపు ప్రభుత్వానికి శిస్తులు, పన్నుల రూపంలో రూ.కోట్ల ఆదాయం వస్తుందన్నారు. దీని వల్ల ప్రభుత్వానికి లాభమే తప్ప ఎలాంటి నష్టం లేదని తెలిపారు. గనుల ప్రైవేటీకరణతో పర్యావరణ విధ్వంసం జరుగుతుందన్నారు. కార్మికుల జీవితాలు అగమ్యగోచరంగా మారానున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.