భారత్‌లో పెరుగుతున్న 5జీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు

by Harish |
భారత్‌లో పెరుగుతున్న 5జీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు ఊపందుకుంటున్నాయి. ఇటీవల దేశీయ వినియోగదారులు 5జీ ఫోన్‌లను కొనేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో తన నివేదికలో స్పష్టం చేసింది. ముఖ్యంగా టైర్2, టైర్3 పట్టణాల్లో ఎక్కువగా పెరుగుతున్నాయని ఒప్పో తెలిపింది. ముఖ్యంగా 18-25 ఏళ్ల యువకులు మెరుగైన కెమెరా ఫీచర్లు ఉన్న 5జీ ఫోన్‌లను ఎంపిక చేసుకుంటున్నారు. ఇక, 35 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారు ప్రాసెసర్, పనితీరు కలిగిన ఫోన్‌లను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

దేశీయంగా కంటెంట్ వినియోగం పెరిగిన నేపథ్యంలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ల డిమాండ్ వృద్ధి చెందుతోందని, అదేవిధంగా ఈ ధోరణి భారత్‌లో డిజిటల్ వినియోగం పెరుగుదలను సూచిస్తుందని ఒప్పో పేర్కొంది. ఒప్పో సేకరించిన వివరాల ప్రకారం.. ఎక్కువమంది కెమెరా, వీడియో పనితీరు ఆధారంగానే కొత్త టెక్నాలజీ ఫోన్‌లను కొంటున్నట్టు తేలింది. వీరిలో దాదాపు 70 శాతం మంది వీడియోలను తీసేందుకు వినియోగిస్తున్నారని, రెండో ఆప్షన్‌గా అప్‌డేటెడ్ స్మార్ట్‌ఫోన్ కొనే ఆసక్తి ఉన్నవారు కొంటున్నారు. ఆ తర్వాత బ్యాటరీ, పర్ఫార్మెన్స్, డిస్‌ప్లే, ప్రాసెసర్‌ను బట్టి 5జీ స్మార్ట్‌ఫోన్‌లు కొంటున్నారని ఒప్పో వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed