రైతు పక్షపాతి సీఎం కేసీఆర్‌: పల్లా రాజేశ్వర్ రెడ్డి

by Shyam |   ( Updated:2020-04-12 05:28:22.0  )
రైతు పక్షపాతి సీఎం కేసీఆర్‌: పల్లా రాజేశ్వర్ రెడ్డి
X

దిశ న‌ల్గొండ: భువనగిరి మండలం రెడ్డినాయక్ తండాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర రైతు సమన్వయ స‌మితి అధ్యక్షులు ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిలు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. దేశంలో తొలుత లాక్‌డౌన్ ప్ర‌క‌టించి తెలంగాణ‌లో క‌రోనా విజృంభించ‌కుండా సీఎం క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకున్నార‌ని ఆయన గుర్తు చేశారు. విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కూడా రైతులు ఇబ్బందులు ప‌డొద్ద‌ని, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతు ప‌క్ష‌పాతిగా సీఎం కేసీఆర్ చ‌రిత్ర‌లో నిలిచిపోతార‌ని పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అభివ‌ర్ణించారు.

Tags: Palla Rajeshwar Reddy, MLA Pailla Shekar Reddy, Grain buying center, Bhongir

Advertisement

Next Story