- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజ్‌భవన్‌లో 'ఓపెన్ హౌజ్' రద్దు
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా నేపథ్యంలో రాజ్‌భవన్ ఈసారి ‘ఓపెన్ హౌజ్’ కార్యక్రమాన్ని రద్దు చేసింది. ప్రతీ ఏటా ఆంగ్ల నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని జనవర్ 1వ తేదీన ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, పౌరుల నుంచి శుభాకాంక్షలు స్వీకరించడం, తెలియజేయడం ఆనవాయితీ. ఎవరైనా రాజ్‌భవన్‌కు వచ్చి శుభాకాంక్షలు తెలియజేయవచ్చు. కానీ ఈసారి కరోనా కారణంగా అధికారులు, ప్రజలు ఫిజికల్‌గా రాజ్‌భవన్‌కు రావడంపై ఆంక్షలు విధించింది.
‘ఓపెన్ హౌజ్’గా పిలిచే ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం రద్దు చేస్తున్నామని, అయితే దీనికి బదులుగా జనవరి 1వ తేదీన ఫోన్ (044-23310521) ద్వారానే ఉదయం 10 గంటల నుంచి ఒక గంట పాటు శుభాకాంక్షలను తెలియజేయవచ్చని రాజ్‌భవన్ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. బ్రిటన్ నుంచి కొత్త స్ట్రెయిన్ రావడం, రాష్ట్రంలోకి ఒకరికి పాజిటివ్ నిర్ధారణ కావడం, జనం గుమికూడడం ద్వారా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉండడం.. వీటన్నింటిని నేపథ్యంలో గవర్నర్ ఈసారి ఫోన్ ద్వారానే ‘ఓపెన్ హౌజ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.