మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్‌లో ఉన్నాడా..? లేడా..? క్లారిటీ ఇచ్చిన ఏపీ ఇంచార్జ్

by srinivas |   ( Updated:2021-06-28 08:32:55.0  )
megastar Chiranjeevi
X

దిశ, ఏపీ బ్యూరో: కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్‌లో కొనసాగడం లేదని ఆ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ఊమెన్‌ చాందీ స్పష్టం చేశారు. విజయవాడలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై జరిగిన సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం లేదని అధికారికంగా ప్రకటించారు. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి.. చేయాల్సిన పోరాటాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి చిరంజీవి హాజరుకాకపోవడంతో ఆయన స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఏ కార్యక్రమం తలపెట్టినా పీసీసీ తరపున అందరికీ సమాచారం వెళ్తుందని అలాగే చిరంజీవికి కూడా వెళ్తోందన్నారు.

కానీ ఆయన ఇప్పటి వరకు స్పందించలేదని తెలిపారు. పార్టీ కార్యక్రమాలకు ఇతర సీనియర్ నేతలు అంతా వస్తున్నారని కానీ చిరంజీవి మాత్రమే రావడం లేదని ఊమెన్ చాందీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన తర్వాత మన్మోహన్ కేబినెట్‌లో చిరంజీవి చోటుదక్కించుకున్నారు. స్వతంత్ర హోదాలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి.. ఆ తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. ప్రస్తుతం వెండితెరపై దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed