ఆన్ లైన్ పరిచయం.. ఓయోకి పిలిచి బాలికను..

by Anukaran |   ( Updated:2021-07-09 06:12:47.0  )
girl rape
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులతో పరిచయం లేనిపోని ప్రమాదాలకు దారితీస్తుందని మరోసారి ఈ సంఘటన నిరూపించింది. సోషల్ మీడియా ద్వారా బీహార్‌లోని పాటలీపుత్రకు చెందిన బాలిక (17)కు రంజాన్, పర్వేజ్ అనే ఇద్దరు యువకులు పరిచయమయ్యారు. ఈ పరిచయం కాస్తా చాటింగ్ నుండి ఫోన్ లలో మాట్లాడుకునే వరకు వచ్చింది.

ఈ నేపథ్యంలో గురువారం పాట్నాలోని ఓ హోటల్‌లో ఓయో యాప్ ద్వారా రూమ్ బుక్ చేసిన యువకులు, సదరు బాలికను అక్కడికి రమ్మన్నారు. తీరా అక్కడుకు వెళ్లిన బాలికపై ఇద్దరు యువకులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాలిక ఈ ఘటన అనంతరం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. బాలికకు వైద్య పరీక్షలు చేయించి, నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Advertisement

Next Story