- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొవిడ్ నివారణకు మేము సైతం అంటున్న ఆన్‌లైన్ డాక్టర్లు
దిశ, ఫీచర్స్ : కొవిడ్ -19 సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా వినాశనాన్ని సృష్టిస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా స్ర్పెడ్ అవుతున్న వార్తలతో బెంబేలెత్తుతున్న జనాలు.. లేనిపోని ఆందోళనలతో ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల నడుమ కొవిడ్‌పై అనుమానాలు, అపోహలు పెరిగిపోతుండగా.. ప్రతీ చిన్న విషయానికి డాక్టర్ దగ్గరకు వెళ్లలేని పరిస్థితి. కానీ చాలామందికి డాక్టర్ చెబితే గానీ సమస్య పరిష్కారం కాదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ‘గో- టు పోర్టల్’గా మారుతున్నాయి. ఇక్కడ మందులు, సిలిండర్లు, హాస్పిటల్ పడకలు తదితర సదుపాయాల గురించి అవసరమున్నవారు లీడ్‌లు కోరుతున్నారు. ఫ్రంట్‌లైన్‌లో ఉన్న ప్రముఖ వైద్యులు సైతం కొవిడ్ -19కు సంబంధించిన సందేహాలు, సమాచారాన్ని అందిస్తూ నెటిజన్లలో అవగాహన కల్పిస్తున్నారు. కాగా, మహమ్మారి చుట్టూ వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచారానికి వ్యతిరేకంగా పోరాడేందుకు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్న కొందరు వైద్యుల వివరాలు మీ కోసం..
డాక్టర్ తాన్య నరేందర్/డాక్టర్ క్యుటేరస్ :
తాన్య.. సాధారణంగా తన వీడియోల ద్వారా లైంగిక ఆరోగ్యం గురించిన అపోహలను తొలిగించే ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రస్తుతం కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా టీకా గురించి అవగాహన కల్పిస్తోంది. పీరియడ్ సమయంలో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవద్దనే ప్రచారం జరిగిన నేపథ్యంలో.. వ్యాక్సిన్ వేసుకోవడానికి, పీరియడ్‌కు ఎలాంటి సంబంధం లేదని, నిరభ్యంతరంగా వేసుకోవచ్చని చెబుతోంది. ఎవరికైనా వ్యాక్సిన్ సంబంధిత సందేహాలుంటే ఆమెతో ఇన్‌స్టాలో చాట్ చేయొచ్చు.
https://www.instagram.com/dr_cuterus/
డాక్టర్ యువరాజ్ :
ప్రముఖ గైనకాలజిస్ట్ అయిన యువరాజ్.. ప్రెగ్నెన్సీ, చైల్డ్ బర్త్ వంటి అంశాలను వివరిస్తుంటాడు. కానీ ప్రస్తుత సిచ్యువేషన్‌లో టీకా సమాచారాన్ని కూడా పంచుకుంటున్నాడు. ప్రెగ్నెంట్ ఉమెన్ వ్యాక్సిన్ వేసుకోవాలా? వద్దా? వ్యాక్సిన్ వల్ల బ్లడ్ క్లాట్స్ ఏర్పడటం నిజమేనా? వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అసలు ఎలాంటి శానిటైజర్ కొనాలి? కొవిడ్ కేస్ రిపోర్ట్స్ భిన్నంగా ఎందుకు ఉంటాయి? వంటి ఎన్నో సందేహాలకు ఆయన వివరణ ఇచ్చాడు.
https://www.instagram.com/doctoryuvi/?utm_source=ig_embed
డాక్టర్ సిద్దార్థ్ భార్గవ్ :
ఫ్రంట్‌లైన్ వర్కర్‌గా ప్రజలకు సేవ చేస్తున్న ఈ యంగ్ డాక్టర్.. కొవిడ్ కారణంగా భయపడుతున్న జనాల్లో అవేర్‌నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. లైఫ్‌స్టైల్, వెల్‌నెస్ లెస్సన్స్‌తో పాటు న్యూట్రిషన్ అంశాలు కూడా వివరిస్తున్నాడు. తన ఇన్‌స్టా అకౌంట్‌లో నిత్యం అందుబాటులో ఉండే ఈ డాక్టర్.. ఇంట్లో హోమ్ ఐసోలేషన్‌లో ఉండేవారికి ‘కొవిడ్ కేర్’ పేరుతో చిన్నపాటి టిప్స్ అందిస్తున్నాడు. ఏవి తినాలి, ఎంతమేరకు తినాలి, రోజూ శరీరానికి ఎంత ప్రోటీన్స్ అవసరమవుతాయో వివరిస్తున్నాడు. అలాగే ప్రస్తుత రంజాన్ మాసంలోఉపవాసం పాటిస్తున్న ముస్లింలు.. ఇలాంటి టఫ్ సిచ్యువేషన్‌లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదనే విషయాలతో పాటు మరెన్నో హెల్త్ టిప్స్‌ను సిద్దార్థ్ తన వీడియోల్లో వివరంగా పేర్కొంటున్నాడు.
https://www.instagram.com/dr.siddhant.bhargava/
డాక్టర్ అనిమేష్ :
ఎంతటి వ్యాధినైనా ఎదుర్కొనేందుకు మన శరీరం సిద్ధంగా ఉంటుంది. కానీ శరీరం యుద్ధం చేసేందుకు అవసరమైన ఇమ్యూన్ సిస్టమ్‌కు కావాల్సినంత యుద్ధ సామగ్రిని ఫుడ్ ద్వారా అందించాలి. కొవిడ్ టైమ్‌లో చాలామంది ఇమ్యూనిటి పెంచుకోవడానికి రకరకాల సోషల్ మీడియా సైట్లు చూస్తున్నారు. అలా కాకుండా ఎక్స్‌పర్ట్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ అనిమేష్ బెస్ట్ మెడికేషన్స్ సూచిస్తున్నాడు. ఊపిరితిత్తుల శక్తి తెలుసుకునేందుకు రౌండ్‌బాల్ టెస్ట్ సజెస్ట్ చేసిన అనిమేష్‌ను SURGERYONLINE appలో కన్సల్ట్ కావచ్చు. కొవిడ్ -19 సంక్రమణ సమయంలో తీవ్రమైన దగ్గు, రక్తపోటు కోసం ACE INHIBITORS తీసుకోవద్దని సూచిస్తున్నాడు.
https://www.instagram.com/dr.animesh_ms/
డాక్టర్ రాశి :
కొవిడ్ సమయంలో చాలామంది మానసిక ఒత్తిడికి లోనవుతూ ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటే కొవిడ్‌ను ఎదుర్కొవడమే సులభమే అని చెబుతూ, మానసిక వికాసానికి సంబంధించిన సందేహాలను నివృత్తి చేస్తోంది డాక్టర్ రాశి. టీకా భద్రతా ప్రొఫైల్ ప్రకారం.. అత్యంత సాధారణ దుష్ప్రభావాల్లో తలనొప్పి(52.6%), అలసట(53.1%), కండరాలు లేదా కీళ్ల నొప్పి(44% లేదా 26.4%), జ్వరం(33.6%), చలి (31.9%), వికారం(21.9%) వాటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ తేలికపాటి నుంచి మధ్యస్త లక్షణాలు ఉంటాయని ఆమె తెలిపింది. టీకాలు మనకు ఆరోగ్యం, ఆనందం, భద్రతను ఇస్తాయని తెలిపింది.
https://www.instagram.com/drrashipsychiatrist/?hl=en
వీరితో పాటు డాక్టర్ రష్మి శెట్టి, డాక్టర్ త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు, డాక్టర్ ఆంకేష్ సాహేత్య, సమరిద్ది శర్మ, రీమా పాండ్య, విద్యా నాయర్, రిద్ధిమా శెట్టిలు తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అమూల్యమైన సలహాలు సూచనలు అందిస్తున్నారు.