- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా ఎఫెక్ట్.. దానికే మొగ్గుచూపుతున్న ప్రజలు
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి కారణంగా భారత్‌లో ఆన్‌లైన్ ద్వారా డాక్టర్‌ను సంప్రదించే వారు రికార్డు స్థాయిలో పెరిగారు. గడిచిన ఏడాది కాలంలో ఈ వృద్ధి భారీగా నమోదైంది. 2020, మార్చిలో దేశీయంగా టెలీకన్సల్టేషన్ మార్కెట్ పరిమాణం సుమారు 26 మిలియన్ డాలర్లు(దాదాపు రూ. 195 కోట్లు) ఉండగా, ఈ ఏడాది మార్చి నాటికి ఏకంగా 163 మిలియన్ డాలర్ల(రూ. 1,200 కోట్ల)కు చేరుకుంది. ఈ నేపథ్యంలో 2024, మార్చి నాటికి ఈ పరిశ్రమ 72 శాతం వార్షిక వృద్ధితో 836 మిలియన్ డాలర్ల(రూ. 6,224 కోట్ల)కు చేరుకుంటుందని ఫ్రాక్సిస్ గ్లోబల్ అలయన్స్ సంస్థ ‘ఇండియా ఔట్ పేషెంట్ హెల్త్‌కేర్ మార్కెట్’ పేరుతో చేసిన అధ్యయనం తెలిపింది.
నిర్దేశించిన సమయానికి ప్రతి 35 డాక్టర్ల సంప్రదింపుల్లో ఒకటి ఆన్‌లైన్ విధానంలో జరుగుతుందని నివేదిక తెలిపింది. ఈ ఏడాది మార్చి నాటికి ఆన్‌లైన్ కన్సల్టెన్సీ వృద్ధి 0.8 శాతం ఉండగా, మొత్తం డాక్టర్ కన్సల్టెన్సీల వృద్ధి 1.6 శాతంగా ఉంది. ముఖ్యంగా కరోనా సమయంలో సౌకర్యం, భద్రత కారణంగానే ఎక్కువమంది టెలీకన్సల్టేషన్స్‌కు మొగ్గు చూపారు. అయితే, వ్యాధి బారిన పడిన వారి లక్షణాలను అర్థం చేసుకునేందుకు ఆన్‌లైన్ విధానం అతిపెద్ద సవాలు. అంతేకాకుండా చెల్లింపులు, అధిక సేవల ఛార్జీలు వైద్యుల మధ్య అసంతృప్తిని కలిగిస్తాయని నివేదిక పేర్కొంది. ఈ ఏడాదిలో ఇప్పటికే డాక్టర్ కన్సల్టేషన్‌ల సంఖ్య 400 కోట్లు దాటినట్టు నివేదిక అంచనా వేసింది. వీటి ప్రిస్క్రిప్షన్ ల ఖర్చు విలువ రూ. 1.93 లక్షల కోట్లకు చేరింది. రానున్న మూడేళ్లలో ఇది 13 శాతం పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది.