- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆన్‌లైన్ అమ్మకాలు 20 శాతానికి పెరిగాయి : బెంజ్!
దిశ, వెబ్‌డెస్క్ : కొవిడ్-19 కారణంగా పని చేసే విధానంతో పాటు వ్యాపారంలో కూడా కొత్త పద్ధతులు ప్రారంభమయ్యాయని మెర్సిడెజ్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో మార్టిన్ ష్వెంక్ అభిప్రాయపడ్డారు. కార్ల తయారీదారులు కూడా వినూత్న ఆలోచనలను కలిగి ఉన్నారు. ఎక్కువ భాగం కొనుగోళ్లను కాంటాక్ట్‌లెస్ రూపంలో నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు.
అదేవిధంగా కరోనా మహమ్మారి సమయంలో మెర్సిడెస్ బెంజ్ ఇండియా కార్లను డిజిటల్ విధానంలో కొనేవారి సంఖ్య పెరిగిందని జాతీయ మీడియాకు ఇచ్చిన ఈ-మెయిల్ ఇంటర్వ్యూలో మార్టిన్ తెలిపారు. కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో కస్టమర్లకు ఇచ్చే రక్షణ కోసం ఎలాంటి మార్పులు చేయనున్నారు అని అడగ్గా, తమ డీలర్‌షిప్‌లలో అన్ని రకాల కరోనా భద్రతా ప్రమాణాలను, భౌతిక దూర నిబంధనలను పాటిస్తూ కార్యకలాపాలను ప్రారంభించినట్టు చెప్పారు.
ప్రస్తుతం దేశంలో అన్ని డీలర్‌షిప్స్ పూర్తిగా పనిచేస్తున్నాయి. ప్రస్తుత ఏడాది పండుగ సీజన్‌లో కార్ల డెలివరీలు గతేడాది మాదిరిగానే ఉన్నాయి. కొత్త వాతావరణంలోనూ సాధార స్థాయికి చేరుకున్నామని మార్టిన్ స్పష్టం చేశారు. ఇటీవల లగ్జరీ కార్ల కొనుగోళ్లు పెరిగాయని, మరోవైపు డిజిటల్, కాంటాక్ట్‌లెస్ లఅమ్మకాలు జరుగుతున్న క్రమంలో ఆన్‌లైన్ అమ్మకాలు మొత్తం వాల్యుమ్‌లలో 20 శాతం వాటాను దక్కించుకున్నట్టు మార్టిన్ ష్వెంక్ వెల్లడించారు.