ఏపీలో జూలై 15 నుంచి ఆన్‌లైన్ క్లాసులు

by srinivas |
ఏపీలో జూలై 15 నుంచి ఆన్‌లైన్ క్లాసులు
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో జూలై 15 నుంచి విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చిన వీరభద్రుడు వెల్లడించారు. ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. దూరదర్శన్, రేడియో, విధ్యవారధి ద్వారా ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. కృష్ణాజిల్లాలోని పెడనలో ‘నాడు-నేడు’ కింద అభివృద్ధి చేసిన స్కూల్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 1 నుంచి ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయులు 50 శాతం హాజరవుతున్నారన్నారు. అలాగే విద్యార్ధుల ప్రవేశాల ప్రక్రియ కూడా కొనసాగుతోందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed