- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సింగరేణిలో కొనసాగుతున్న నిరసనలు
దిశ, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ లోని ఓసీపీ-1లో జరిగిన బ్లాస్టింగ్ బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ రెండో రోజు కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. ఓసీపీలో పనులు చేసేందుకు కార్మికులు నిరాకరించారు. పర్మినెంట్ కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు ఓపెన్ కాస్ట్ లోకి ఎవరూ వెళ్లలేదు. పనులు చేసేందుకు యాజమాన్యం సమాయత్తం అవుతుండగా కార్మిక సంఘాలు అడ్డుకున్నాయి. దీంతో ఓసీపీ-1లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మరోవైపున బాధిత కుటుంబాలతో పాటు కార్మిక సంఘాలు గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రి ముందు ఆందోళన చేస్తున్నారు. మృతదేహాలను ఆసుపత్రి మార్చూరీలోనే భద్రపరిచారు. బ్లాస్టింగ్ ఘటన తరువాత కాంట్రాక్టు మహాలక్ష్మీ ఓబీ కాంట్రాక్టు సంస్థ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం కార్మికులను ఆందోళన కల్గిస్తోంది. సింగరేణి డైరక్టర్ చంద్ర శేఖర్ గోదావరిఖనికి చేరుకుని బాధిత కుటుంబాలకు యాజమన్యం తరుపున న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా స్పష్టత లేదంటూ బాధిత కుటుంబాలు ఆందోళన చెస్తున్నాయి. దీంతో బుధవారం కూడా గోదావరిఖని ఏరియా ఆసుపత్రి వద్ద ఆందోళనలు కొనసాగతున్నాయి.