కొనసాగుతున్న మండల పరిషత్ ఉప ఎన్నికల పోలింగ్

by srinivas |
కొనసాగుతున్న మండల పరిషత్ ఉప ఎన్నికల పోలింగ్
X

దిశ, ఉత్తరాంధ్ర: ఉత్తరాంధ్ర వ్యాప్తంగా మండల పరిషత్ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. విశాఖ జిల్లాలో ఆనందపురం జడ్పీటీసీతో పాటు దాలివలస, జానకయ్యపేట, వంతర్లపాలెం, నాగులాపల్లి-2, భీమబోయిన పాలెం, దిబ్బపాలెం-3 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది. వీటితో పాటు గొలుగొండ మండలం పాకలపాడు ఎంపీటీసీ స్థానం పరిధిలోని రెండు బూత్‌లలో పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఆనందపురం జడ్పీటీసీ పరిధిలో 49,282 మంది, ఆరు ఎంపీటీసీ స్థానాలు, పాకల పాడులోని రెండు బూత్‌లలో కలిపి మొత్తం 68,371 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీపీ ఉప ఎన్నికలకు 83 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 40 సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. బందోబస్తు నిమిత్తం 437 మందిని, పోలింగ్‌ నిర్వహణకు 299 మందిని నియమించారు.

శ్రీకాకుళం

అటు శ్రీకాకుళంలో కూడా ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. హిరమండలం జడ్పీటీసీ స్థానంతో పాటు 15 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 95 కేంద్రాలలో పోలింగ్ జరుగుతుంది. దాదాపు 73,743 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మరోవైపు విజయనగరంలో తొమ్మిది ఎంపీటీసీ స్థానాల్లో ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 11 స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేయగా.. రెండు స్థానాల్లో ఏకగ్రీవాలు అయ్యాయి. మిగిలిన 9 స్థానాల్లో నేడు ఎన్నికలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించడానికి అధికారులు చర్యలు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed