నువ్వు తురుం రా..! : పూరీ

by  |
నువ్వు తురుం రా..! : పూరీ
X

ఇస్మార్ట్ శంకర్.. లవ్‌లీ హీరో రామ్‌లోని ఊరమాస్ యాంగిల్‌ను ఆవిష్కరించిన సినిమా. తెలంగాణ యాస, భాష, యాటిట్యూడ్‌తో ఇస్మార్ట్ శంకర్‌గా యాక్టింగ్ ఇరగదీసిన రామ్.. ఈ సినిమాతోనే మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడు. అటు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా చాలా ఫెయిల్యూర్స్ తర్వాత ఈ సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. జులై 18, 2019న విడుదలైన ఇస్మార్ట్ శంకర్ బొమ్మ ఇస్మార్ట్ హిట్ కాగా.. సినిమా రిలీజై నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా స్పెషల్ ట్వీట్ చేశారు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఇస్మార్ట్ శంకర్‌ సక్సెస్ తన లైఫ్‌లో మళ్లీ ఎనర్జీని తీసుకొచ్చిందని తెలిపాడు. తనను నమ్మి సినిమా చేసిన హీరో రామ్‌కు థాంక్స్ చెప్పిన పూరీ.. రామ్‌తో షూటింగ్ ప్రతీ రోజు ఒక పండగలా ఉండేదన్నాడు. తనను కలిసి హగ్ ఇవ్వాలని ఉందన్న పూరీ.. నువ్వు తురుం రా..! అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు.

దీనిపై స్పందించిన రామ్.. ‘మై గన్.. నిన్ను మీట్ అవ్వడం, నా కళ్ల ముందే నువ్వు ఇస్మార్ట్ శంకర్ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దడం.. నా లైఫ్‌లో మరిచిపోలేని అనుభవమంటూ’ ట్వీట్ చేశాడు. ఎవరూ చూడనట్లుగా తనలోని మాస్ యాంగిల్ చూసినందుకు పూరీకి థాంక్స్ చెప్పాడు. నిర్మాత, లిటిల్ బాస్ చార్మి సినిమా కోసం చాలా కష్టపడిందన్న రామ్.. హాట్, హాటర్, హాటెస్ట్ నిధి అగర్వాల్, చాందిని నభా నటేష్‌కు థాంక్స్ చెప్పాడు. సత్యదేవ్ నటనను ప్రశంసించిన రామ్.. ది బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ అందించిన మణిశర్మకు ధన్యవాదాలు తెలిపాడు.

https://www.instagram.com/tv/CCxlcYdFsIt/?igshid=1ocmanzgy1bcb


Next Story

Most Viewed