టీడీపీకి షాకుల మీద షాకులు..వైఎస్సార్సీపీలోకి మరో ఇద్దరు

by srinivas |
టీడీపీకి షాకుల మీద షాకులు..వైఎస్సార్సీపీలోకి మరో ఇద్దరు
X

ఏపీలో టీడీపీకి షాకులు మీద షాకులు తగులుతున్నాయి. 2019 ఎన్నికల్లో ఓటమి తరువాత టీడీపీ నేతలు పక్కచూపులు చూస్తున్నారు. తొలుత ఆ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు బీజేపీలో చేరడంతో వలసలు ఆరంభమయ్యాయి. ఆ నలుగురు పార్టీ మారడం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారన్న కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయనుకోండి అది వేరే విషయం.

ఆ తరువాత ఒకరి తరువాత ఒకరుగా టీడీపీని నేతలు వీడుతున్నారు. పార్టీ వీడుతున్నవారంతా టీడీపీలో సరైన గుర్తింపు లభించడం లేదని పేర్కొనడం విశేషం. వల్లభనేని వంశీ వివాదం టీడీపీని కుదిపేసింది. పార్టీ అధినేతపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన వంశీ.. వైఎస్సార్సీపీలో చేరలేదు. పార్టీలో కూడా లేరు. ఇక ఆ తరువాత వలసల తుట్టెను ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ కదిపారు. ఆయన రాజీనామా చేయడంతో వరుసగా ఆ పార్టీ నేతలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు.

ప్రకాశం జిల్లాలో తిరుగులేని టీడీపీ నేతగా పేరొందిన కరణం బలరాం పార్టీని వీడి, వైఎస్సార్సీపీలో చేరడం ఆపార్టీకి మింగుడుపడని వ్యవహారంగా మారింది. ఆ తరువాత రామసుబ్బారెడ్డి, సతీష్ రెడ్డి ఇలా సుదీర్ఘ కాలం పార్టీ కోసం పనిచేసిన నేతలు టీడీపీని వీడడం అధినేతకు ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు అనంతపురం జిల్లానుంచి వలసలు ఆపార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి.

అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గానికి చెందిన టీడీపీ మహిళా నేతలు మాజీ ఎమ్మెల్యే బి.యామినీబాల, ఎమ్మెల్సీ పామిడి శమంతకమణిలిద్దరూ వైఎస్సార్సీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. అనంతపురం నుంచి పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో ఈ ఇద్దరు మహిళా నేతలు తాడేపల్లి బయల్దేరారు. సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వారిద్దరూ పార్టీ కండువాలు కప్పుకోనున్నారు.

శింగనమల నియోజకవర్గంపై మంచిపట్టున్న ఈ ఇద్దరు మహిళా నేతలు పార్టీ వీడడం జిల్లాలోని టీడీపీపై ప్రభావం చూపుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. జిల్లాలో జేసీ, పయ్యావుల వంటి నేతలు ఉన్నప్పటికీ వారిని ఆపలేకపోవడం పార్టీలో అభద్రతా భావాన్ని బట్టబయలు చేస్తోందని వారు పేర్కొంటున్నారు.

Tags: tdp, yamini bala, samanta kamani, ysrcp, party change

Advertisement

Next Story

Most Viewed