- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
కారు ఆటో ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు
X
దిశ, నేరేడుచర్ల : కారు ఆటో ఢీ కొట్టిన ప్రమాదంలో ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలైన సంఘటన మఠంపల్లి మండలంలోని మట్టపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మట్టపల్లి గ్రామం నుండి తంగెడ వెళ్ళే బ్రిడ్జ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.
మట్టపల్లి నుండి హుజూర్ నగర్ వెళుతున్న ఆటోను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణ జిల్లా జగ్గయ్యపేట నుండి మట్టపల్లి వస్తున్న కారు ఎదురెదురుగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ అనిల్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అంబులెన్స్ లో అనిల్ ను హుజూర్నగర్ హాస్పిటల్ కి తరలించారు. డ్రైవర్ అనిల్ సొంత గ్రామం మఠంపల్లి మండలం రఘునాథపాలెంగా గుర్తించారు.
Advertisement
Next Story