ప్రాణం తీసిన వివాదం..

by Shyam |   ( Updated:2023-02-03 06:14:26.0  )
ప్రాణం తీసిన వివాదం..
X

హైదరాబాద్: కారు, బైకు ఢీకొన్న ఘటనలో జరిగిన చిన్న వివాదం ప్రాణం తీసే వరకూ వెళ్లింది. వివరాల్లోకెళ్తే.. హయాత్‌నగర్‌లో ప్రమాదవశాత్తు కారు, బైకు ఢీకొన్నాయి. దీంతో కారులో ఉన్న ప్రసాద్‌, సతీష్‌ అనే వ్యక్తులకు, బైక్‌పై ఉన్న పరమేశ్వర్‌, రాజు అనే వ్యక్తులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ, వినిపించుకోకుండా ఆగ్రహంతో పరమేశ్వర్, రాజులను కారులో ఎక్కించుకుని ఎక్కడికో తీసుకెళ్తుండగా, కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పరమేశ్వర్‌ మృతి చెందగా, రాజు పరిస్థితి విషమంగా ఉంది. దీంతో నిందితులిద్దరూ కారును వదిలేసి పరారయ్యారు.

tags: car accident, hayathnagar, bike accident,

Advertisement

Next Story

Most Viewed