‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నా అభిమానులందరికీ విన్నపం’

by Shyam |
‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నా అభిమానులందరికీ విన్నపం’
X

కరోనా వైరస్ విస్తృత వ్యాప్తి కారణంగా.. దేశం మొత్తం లాక్‌డౌన్ విధించడంతో సినిమా ఇండస్ర్టీ చెందిన వాళ్లే కాకుండా, రాజకీయ నాయకులు సైతం ఎవరూ తమ పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకోవడం లేదు. ఇప్పటికే కొంతమంది హీరోలు తమ బర్త్ డే వేడుకలకు తమను కలవద్దు, ఎలాంటి వేడుకలు నిర్వహించొద్దు ఫ్యాన్స్‌ను వేడుకున్నారు. ఈ క్రమంలో బుధవారం(జూన్ 10) టీడీపీ ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు బహిరంగా లేఖ రాశారు. ‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నా అభిమాన సోదరులందరికీ నా ఆత్మీయ విజ్ఞప్తి.’ ‘నా 60వ పుట్టిన రోజుని మీ ఇంటి పండగలా కనీ, వినీ ఎరుగని రీతిలో సంబురాలు చేస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా హితులు, శ్రేయాభిలాషులు, కుటుంబసభ్యులైన మీ అందరితో కలిసి వేడుక చేసుకొనే అదృష్టానికి అంతరాయం ఏర్పడినందుకు బాధగా ఉంది. ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో మీ అందరి ఆరోగ్యం గురించి ఆలోచించడం నా బాధ్యత. మీ క్షేమమే నాకు కొండంత ఆశీర్వాదం. ప్రభుత్వ నిబంధనలు, ఆంక్షలు మనందరి కర్తవ్యం. అందుకే అందర్నీ కలవాలన్న నా ఆకాంక్షకి అడ్డుకట్ట వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి మీ ఆరోగ్యాల్ని నిర్లక్ష్యం చేసి ఎవరూ నన్ను కలవడానికి రావద్దని కోరుతున్నాను. ఈ రోజు(మంగళవారం) ద్వారక క్రియేషన్స్‌లో బోయపాటి దర్శకత్వంలో నేను నటిస్తున్న చిత్రం టీజర్, నేను పాడిన పాట విడుదల అవుతున్నాయి. దీనిని అందరూ ఆస్వాదించండి.. ఆశీర్వదించడండి నా మిన్నపాన్ని మన్నిచండి’ అని లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed