ఎన్టీఆర్‌ జీవితంపై… పదో తరగతిలో పాఠ్యాంశం!

by  |
ఎన్టీఆర్‌ జీవితంపై… పదో తరగతిలో పాఠ్యాంశం!
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ నందమూరి తారకరామారావుకు తెలంగాణలో అరుదైన గౌరవం దక్కింది. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెలంగాణ పదో తరగతి పుస్తకాల్లో పాఠ్యాంశాన్ని రూపొందించారు.

ఒక నటుడిగా జీవితం మొదలు పెట్టి, రాష్ట్రానికి సీఎం అయ్యి రూ.2 కిలో బియ్యం, మద్యపాన నిషేధం వంటి పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచిపియారు. దాంతో ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా మారిస్తే ఎంతో మంది విద్యార్థులకు ఉపయోగపడుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. పదోతరగతి సాంఘిక శాస్త్రంలో పేజీ నంబర్ 268లో ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్యమైన అంశాలను పేర్కొన్నారు.


Next Story

Most Viewed