రిజర్వేషన్లు 50శాతానికి మించడంపై స్పందించండి: రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం

by Shamantha N |
supreme court
X

న్యూఢిల్లీ : రిజర్వేషన్లను 50శాతం నిబంధనకు మించినప్పటికీ మరాఠాలకు కోటా ఇవ్వాలా? లేదా? అనే విషయాన్ని సుప్రీంకోర్టు పరిశీలిస్తున్నది. కోటాను 50శాతానికి మించి ఇవ్వడంపై స్పందించాల్సిందిగా అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఎల్ నాగేశ్వరరావు, ఎస్ అబ్దుల్ నజీర్, హేమంత్ గుప్తా, రవీంద్ర భట్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశంపై వాదనలు వింటున్నది. తాజాగా రాష్ట్రాలకు నోటీసులు పంపి తదుపరి విచారణను 15వ తేదీకి వాయిదా వేసింది. సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ చట్టం కింద రిజర్వేషన్లు ఇచ్చే మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బాంబే హైకోర్టు సమర్థించడాన్ని కొందరు పిటిషనర్లు సుప్రీంకోర్టుల సవాల్ చేశారు. 2019లోనే ఈ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అనంతరం ఈ విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. అప్పటి నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠా రిజర్వేషన్ల కింద ఉద్యోగ నియామకాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలను చేపట్టలేదు. ఈ రిజర్వేషన్లు పునరుద్ధరించే వరకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టవద్దని శివసేన ప్రభుత్వానికి మరాఠా క్రాంతి మోర్చా వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed