220 దేశాల్లో 130 చానల్స్‌లో ఒలింపిక్ ప్రసారాలు

by Shyam |   ( Updated:2021-07-20 22:22:09.0  )
220 దేశాల్లో 130 చానల్స్‌లో ఒలింపిక్ ప్రసారాలు
X

దిశ, స్పోర్ట్స్: టోక్యో ఒలింపిక్స్ 220పైగా దేశాల్లో ప్రసారం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ మెగా క్రీడల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీతో 130కిపైగా బ్రాడ్‌కాస్టర్లు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. జులై 23 నుంచి అగస్టు 8 వరకు జరిగే క్రీడలకు సంబంధించి లైవ్ ప్రసారాలను ఆయా చానల్స్‌ అందించనున్నాయి. ఇక ఇండియాలో సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ 5 చానల్స్‌లో లైవ్ ప్రసారాలు చేయనున్నది.

సోనీ టెన్ 1, సోనీ టెన్ 2, సోనీ టెన్ 3, సోనీ టెన్ 4, సోనీ సిక్స్ చానల్స్‌లో ఈ క్రీడలు ప్రసారం కానున్నాయి. దీంతో పాటు భారత అథ్లెట్లు పాల్గొనే క్రీడలను దూరదర్శన్ కూడా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది. ఒలింపిక్స్ కవరేజి కోసం 8100 బ్రాడ్‌కాస్ట్ స్టాఫ్ 33 వేదికల్లో ఉండనున్నారు. వీరిలో 35 శాతం మంది జపాన్ ఉద్యోగులే. మొత్తం 1500 కెమేరాలను ఉపయోగించనుండగా.. వీటిలో 210 స్లో మోషన్ కెమేరాలు. 250 మినీ కెమేరాలు కూడా ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed