- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళల జూనియర్ హాకీ కెప్టెన్‌గా లాల్‌రెమ్సియామీ
దిశ, స్పోర్ట్స్: మహిళల జూనియర్ వరల్డ్ కప్ త్వరలో దక్షిణాఫ్రికా వేదికగా జరుగనున్నది. డిసెంబర్ 16 నుంచి ప్రారంభమయ్యే ఈ వరల్డ్ కప్‌లో 16 దేశాలు పాల్గొంటున్నాయి. ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనే భారత మహిళా జూనియర్ జట్టును సోమవారం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ హాకీ (ఎఫ్ఐహెచ్) ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న జట్టులో సభ్యురాలైన్ లాల్‌రెమ్సియామీని కెప్టెన్‌గా నియమించారు. ఇక డిఫెండర్ ఇషికా చౌదరి వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నది. వీరితో పాటు సాలిమా టెటే, షర్మిలా దేవి, బిచ్చూ దేవి, ఖరిబామ్, ఖుష్బు, అక్షత అబాసో, ప్రియాంక, మరీనా లాల్‌రామ్‌ఘకీ, అజ్మీనా కుజుర్, బల్జీత్ కౌర్, రీత్, వైష్ణవి విట్టల్, బ్యూటీ డుంగ్ డుంగ్, దీపిక, ముంతాజ్ ఖాన్, సంగీత కుమారి, జివాన్ కిషోరిని జట్టులో ఎంపిక చేశారు. ప్రీతి, ప్రభ్‌లీన్ కౌర్‌లను రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేశారు. 18 మందిలో ఎవరైనా కరోనా బారిన పడితే వీరిని ఆడిస్తారు. మహిళల జూనియర్ హాకీ వరల్డ్ కప్ చివరి సారిగా 2016లో జరిగింది. అర్జెంటీనా జట్టు వరల్డ్ చాంపియన్లుగా నిలిచారు. భారత జట్టు 2013లో కాంస్య పతకం గెలిచింది. అదే అత్యుత్తమ ప్రదర్శన.
- Tags
- Hockey