- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళ చితిమంటల్లో.. మరోమహిళ
దిశ, వెబ్ డెస్క్ : శ్మశానంలో కాలుతున్న చితిలో పడి ఓవృద్ధురాలు మృతి చెందిన ఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో చోటు చేసుకుంది. చంద్రమ్మ అనే వృద్ధురాలి భర్త ఇటీవలే మరణిచడంతో ఆమె మతిస్థిమతం కోల్పోయంది. అయితే గతకొంతకాలంగా ఆమెను తన కొడుకులు ఇంట్లోనే ఓ గదిలో ఉంచి ఆహారాన్ని అందిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా కృష్ణానగర్‌కు చెందిన మహిళ అనారోగ్యంతో చనిపోయింది. కండ్రవీధి శ్మశానవాటికలో ఆమెకు గురువారం దహన సంస్కారా నిర్వహించి, వచ్చిన వారంతా వెనుదిరిగి వెళ్లిపోయారు. అనుకోని విధంగా ఈ వృద్ధురాలు శ్మశాన వాటికకి వచ్చింది. శ్మశాన వాటికకి వచ్చిన వృద్ధురాలు మహిళ చితి మంటల్లోకి దూకేసింది. ఆమె దూకడం అక్కడికి దూరంగా ఉన్న పశువులకాపరి చూశాడు. సమాచారం అందుకున్న వృద్ధురాలి కొడుకులు తన తల్లి మృతి పట్ల ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులకు తెలపడంతో శ్మశానవాటిక వద్దనే మృతదేహానికి వైద్యులు పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.