ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది!

by Harish |
ola
X

దిశ, వెబ్‌డెస్క్: ఎలక్ట్రిక్ వాహన విభాగంలో అత్యంత ఆసక్తిగా మారిన ఓలా ఈ-స్కూటర్ ఆదివారం మార్కెట్లో విడుదలైంది. మొత్తం రెండు వేరియంట్లు, పది రంగుల్లో వచ్చిన ఈ స్కూటర్ రూ. 99,999 నుంచి రూ. 1,29,999 ధరల్లో లభిస్తుందని ఓలా వ్యవస్థాపకుడు భవీశ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. ఎస్1, ఎస్1 ప్రో పేర్లతో తీసుకొచ్చిన ఈ స్కూటర్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లకు గట్టి పోటీ ఇచ్చే ప్రత్యేకతలతో ఉంటుందని కంపెనీ భావిస్తోంది.

ఎస్1 ఈ-స్కూటర్ 50-లీటర్ అండర్‌సీట్ స్టోరేజ్‌తో పాటు రివర్స్ మోడ్‌లో కూడా వెళ్లే అధునాతన ఫీచర్లతో వచ్చింది. ఇంకా, ఎస్1 వేరియంట్‌లో ఎల్ఈడీ లైటింగ్, 7-అంగుళాల డిస్‌ప్లే, 3జీబీ ర్యామ్‌తో ఆక్టా కోర్ చిప్‌సెట్‌తో పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా ప్రత్యేక యాప్ ద్వారా ఆటోమెటిక్ లాక్, అన్‌లాక్ చేసుకోవచ్చు. ఎస్1 స్కూటర్ గరిష్ఠంగా 90 కిలోమీటర్లు, ఫుల్ ఛార్జ్ చేస్తే 121 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అలాగే, 3.6 సెకన్లలో 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇక, ఎస్1 ప్రో గరిష్ఠంగా 115 కిలోమీటర్లతో ఫుల్ ఛార్జ్ చేస్తే 181 కిలోమీటర్లు వెళ్తుంది. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 18 నిమిషాల్లో 0-50 శాతం ఛార్జింగ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed